Upcoming Telugu Movies In Coming Two Months


వ‌చ్చే రెండు నెల‌ల్లో రానున్న తెలుగు సినిమాలు ఇవే..
సమ్మర్లో భారీ సినిమాల సందడికి తెరపడ్డట్లే. ఒక బ్లాక్ బస్టర్.. రెండు డిజాస్టర్లతో సమ్మర్ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇక జూన్ నుంచి కొత్త సీజన్ ఆరంభం కాబోతోంది. భారీ సినిమాలు గ్యాప్ ఇవ్వడంతో మళ్లీ మీడియం, చిన్న మీడియం సినిమాల సందడి మొదలుకాబోతోంది. రాబోయే రెండు నెలల్లో దాదాపు ప్రతి వారానికి సినిమాల షెడ్యూళ్లు ఇంచుమించు ఖరారైపోయాయి.
ముందుగా జూన్ 2న అ.. ఆ భారీ అంచ‌నాల మ‌ధ్య ఓన‌మాలు నేర్ప‌నుంది. తర్వాతి వారం సందీప్ కిషన్ ‘ఒక్క అమ్మాయి తప్ప’తో పాటు సుమంత్ అశ్విన్ ‘రైట్ రైట్’ కూడా రిలీజవుతుంది. త‌రువాత 17న నాని ‘జెంంటిల్ మన్’ మంచి క్రేజ్ మధ్య విడుదల కాబోతోంది. తర్వాతి వారం మెగా ప్రిన్సెస్, కొణిదెల వార‌మ్మాయి నిహారిక ‘ఒక మనసు’ తో వెండితెర‌కు ప‌రిచ‌యం కానుంది. ఆపై వారం తెలుగు సినిమాలేవీ రిలీజవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే జులై 1న సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘కబాలి’ తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ‘కబాలి’ వచ్చిన వారానికి విక్టరీ వెంకటేష్ ‘బాబు బంగారం’ను ప్లాన్ చేస్తున్నారు. ఇక జులై 15న నాగచైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సాహసం శ్వాసగా సాగిపో’ షెడ్యూల్ అయి ఉంది. చైతూ నటిస్తున్న మరో సినిమా ‘ప్రేమమ్’ ఇంకో రెండు వారాల గ్యాప్ లో.. అంటే జులై 29న విడుదల చేయాలనుకుంటున్నారట. అంతటితో చిన్న, మీడియం సినిమాల సందడికి తెరపడనుంది. ఇక ఆగస్టు 12న ‘జనతా గ్యారేజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి ముందు, తర్వాతి వారాల్లో వేరే సినిమాలేవీ విడుదల కాకపోవచ్చు.