సుకుమార్ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన ఉపాసన


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ ను గతంలో ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ మాస్ లుక్ లో చూపించబోతున్నాడు దర్శకుడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. లుంగీ, బనియన్ లో భారీ గడ్డంతో రామ్ చరణ్ భిన్నమైన లుక్ చూసి చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఫోటో లీక్ అయింది. ఈ ఫోటో చూస్తుంటే ఇందులో రామ్ చరణ్ చేసేది మామూలు మాస్ క్యారెక్టర్ కాదు.... ఊరమాస్ క్యారెక్టర్ అని స్పష్టమవుతోంది.


ఇలా సెట్స్ నుండి రోజుకో ఫోటో లీక్ అయితున్నప్పటికీ, రామ్ చరణ్ ఈ సినిమాలో చేసే క్యారెక్టర్ ఏంటో ఎవరికీ అంతుపట్టలేదు. కానీ, ఇటీవల రామ్ చరణ్ సినిమా షూటింగ్ స్పాట్ వెళ్లిన రామ్ చరణ్ భార్య ఉపాసన... రామ్ చరణ్ తో సీల్ఫీ దిగి ఫిషర్ మాన్ తో అద్భుతమైన సమయం గడిపాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి చిత్ర యూనిట్ నుండి ఏమైనా కాల్ వచ్చిందేమో కొద్దిసేపటికే ఫిషర్ మాన్ ప్లేస్ లో ఫిషింగ్ కల్చర్ అని ఎడిట్ చేసింది ఉపాసన. దీన్ని బట్టి ఈ సినిమాలో రామ్ చరణ్ ఫిషర్ మాన్ గా కనిపించనున్నాడని స్పష్టంగా అర్ధం అవుతుంది.