ఉపాస‌న అంత ప‌ని చేసిందా..?


టాలీవుడ్ లో ఉన్న హీరోల భార్య‌ల పేర్లు మీడియాలో వినిపించ‌డం చాలా అరుదు. భ‌ర్త సినిమాల‌కు భార్య కేర్ తీసుకోవ‌డం, ప్లానింగ్ చేయ‌డం లాంటివి ఒక‌ప్పుడు ఉండేవి కావు. కానీ ఇలాంటి వాటికి భిన్నంగా మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌త ఈ ట్రెండ్ ను మార్చేసి,  మ‌హేష్ బాబు ను వెనుక నుంచి నడిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అయితే ఇప్పుడు ఉపాస‌న కూడా సేమ్ న‌మ్ర‌తనే ఫాలో అయేట్లు క‌నిపిస్తుంది. 
 
రామ్ చ‌ర‌ణ్ ధృవ సినిమా రిలీజ్ కు ద‌గ్గర ప‌డుతున్న త‌రుణంలో, ఈ సినిమాకు సంబంధించిన పర్ఫెక్ట్ ప్లానింగ్ , ప్ర‌మోష‌న్స్ కోసం ప్ర‌ణాళిక‌ల్లో కార్పోరేట్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటుంద‌ట ఉపాస‌న‌. అప్ప‌ట్లో బ్రూస్ లీ రిలీజ్ టైమ్ లో చెర్రీ సినిమా ప‌నుల‌ను టేక‌ప్ చేసినా, అప్ప‌టికే రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో, పెద్ద‌గా ఏమీ చేయ‌లేక‌పోయిన ఉపాస‌న ఇప్పుడు మాత్రం కావాల్సినంత స‌మ‌యం ఉండ‌టంతో, సినిమాపై బ‌జ్ క్రియేట్ చేసేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేయ‌డానికి సిద్ద‌మైపోయింద‌ట‌. దీనికోసం ముంబై నుంచి ఒక ప్ర‌మోష‌న్ ఏజెన్సీని కూడా ఆల్రెడీ దింపేసింద‌ట ఉపాసన‌.  అటు త‌న హాస్పిట‌ల్ వ‌ర్క్ తో పాటూ, ఇటు చెర్రీ హెల్త్ కేర్, త‌న‌తో పాటూ కలిసి విదేశాల‌కు షూటింగ్ కు వెళ్ల‌డం, సినిమా ప్ర‌మోష‌న్స్ ను చూసుకోవ‌డం..ఇవ‌న్నీ చూస్తుంటే, ఉపాస‌న న‌మ్ర‌త‌ను ఫాలో అవుతున్న‌ట్లే ఉంది క‌దా..