చైతూతో మ‌రో మ‌న్మథుడు తీస్తాడేమో..!


మొన్నామ‌ధ్య మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య హీరోగా ఒక సినిమా రానుందని, దానికి నాగార్జున కాస్త గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేశాడ‌ని వార్త‌లొచ్చిన విష‌యం విదిత‌మే. కానీ, త్రివిక్ర‌మ్ అప్ప‌ట్లో వ‌రుస క‌మిట్‌మెంట్ల‌తో బిజీగా ఉండ‌టంతో, చైతూతో సినిమా చేయడానికి కుద‌ర‌లేదు. అయితే ఇప్పుడు  అందుతున్న తాజా స‌మాచారం ఏంటంటే, ఈ క్రేజీ కాంబినేష‌న్ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కే ఛాన్స్ ఉంద‌ట‌.


ప్ర‌స్తుతం కాట‌మ రాయుడు సినిమా చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఆ సినిమా అయిపోయిన వెంట‌నే త్రివిక్ర‌మ్ తో చేసే షూటింగ్ కు హాజ‌రు కావల‌సి ఉంది. ఈ నేప‌థ్యంలోనే త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ కోసం మంచి క‌థ‌ను రెడీ చేసే ప‌నిలో ఉన్నాడు. ఇటు నాగ‌చైత‌న్య కూడా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కత్వంలో సినిమా చేస్తున్నాడు. సో, ఈ రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత త్రివిక్ర‌మ్- చైతూ కాంబినేష‌న్ లో నాగార్జున ఓ సినిమాను నిర్మించనున్నాడ‌ని అంటున్నారు. చూద్దాం ఏదైనా అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఈ రోజుల్లో ఏ వార్త‌నూ న‌మ్మ‌లేం