Trivikram Shows His Mark On A..Aa Promotions


ప్ర‌మోష‌న్ల‌లోనూ త్రివిక్ర‌మ్ మార్క్
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అ ఆ' సినిమా, జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు .. హీరో, హీరోయిన్ టీవీ ఛానల్స్ కి వెళ్లి, అక్కడ యాంకర్స్ సినిమా గురించి అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుంటారు. ఈ సినిమా నిర్మాణం సమయంలో తమకి ఎదురైన అనుభవాలను పంచుకుంటూ వుంటారు.
ఇదంతా రొటీన్ గా అనిపించిందేమో త్రివిక్ర‌మ్ కి, 'అ ఆ' సినిమా ప్రమోషన్స్ కొత్తగా ఉండేలా డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేశాడట. చాలా హ్యూమరస్ గా ఉండేలా, తనే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి.. తానే ఆన్సర్లు కూడా రాసిచ్చాడట. అయితే తను చెప్పిన ఆన్సర్లు ఏంటో మాట్లాడే నటుడికి తప్పించి పక్కవారికి తెలియవు. ఈ ప్రమోషనల్ ఇంటర్యూలను గత రెండు రోజులుగా నితిన్ - సమంత - అనుపమా పరమేశ్వరన్ - రావు రమేష్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు. నేడో రేపో టీవీల్లో, ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తార‌ట‌. మొత్తానికి ప్రమోషన్స్ విషయంలోను త్రివిక్రమ్ తనదైన మార్క్ చూపించనున్నాడన్న మాట.