త్రివిక్ర‌మ్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 ప్రారంభం


త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన నేO 1 సినిమా పూజ కార్యక్రమాల ఈ రోజు ఫిలిం నగర్ గుడిలో జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రాజేష్, నిర్మాత యస్.త్రివిక్రమ్ మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సినిమాలో హీరో పవన్,హీరోయిన్స్ ప్రియ స్వీటీ, బేబీ మోక్ష ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కెమెరా:పురుషోత్తం సాహిత్యం :నాగబాబు సంగీతం:వి యస్ ఎన్ డాన్స్ : రామారావు నిర్మాత :ఎస్. త్రివిక్రమ్ కథ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం ,రాజేష్ యడమ. దర్శకుడు రాజేష్ యడమ మాట్లాడుతూ. శ్రీహరి సినిమాలకు పని చేశాను, 6 ఇయర్స్ గా దర్శకత్వ శాఖలో ఉన్నాను, ఈ సినిమా నాకు మంచి అవకాశం,ఇదోక ప్రేమకథ ఇప్పటి తరం యువతి యువత ఎలా ఉందో ఎలా ఉండాలో చూపించే చిత్రమిది. ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం అమ్మాయి చేయి వదిలి పెట్టకూడదనే అంశాన్ని చెప్పాలి ఈ చిత్రం ద్వార తెలియ చేయాలి .యువత ప్రేమను ప్రపోజ్ చేసుకోవటం ఓకే అయితే శారీరకo గా దగ్గర అవటం లేకుంటే బారు కి వెళ్ళటం ఈ పద్దతి మారాలి అనె అంశాన్ని చూపిస్తున్న సినిమా ఇది.ఈ నెల 15 నుంచి ఏకధాటిగా షూటింగ్ కి చేస్తాం.ఈ సినిమా 3 షెడ్యూల్ లో పూర్తి చేస్తాం.
ఎస్.త్రివిక్రమ్ నిర్మాత మాట్లాడుతూ.
నేను వృత్తి రీత్యా డాక్టర్ ని అయితే సినిమాలంటే చాల ఇష్టం,చాలాకాలంగా సినిమా నిర్మించాలని భావిస్తున్న ఇప్పటికి కుదిరింది.నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిని.ఈ రోజు పవనిజం డే, విజయదశమి మంచి రోజు పూజ కార్యక్రమాలలో తో సినిమా మెదలు పెట్టాం. మంచి కథ యువతరం తెలుసు కోవాలి అనుకుంటున్న విషయాలు అంశాలు చాల ఉన్నాయి. ఇందులో ఓక మెసేజ్ ఉంటుంది. యువతికి. ప్రేమను వ్యక్తీఖరించే విధాలు వేరుగా ఉన్నా . ప్రేమ భావం ఒక్కటే ఇదే మా సినిమా మూలకధ. రెండు షెడ్యూల్స్ లో టాకీ పార్ట్ ఓక షెడ్యూల్ లో పాటలు పూర్తి చేస్తాం. ప్రేమ కుటుంబ కథా చిత్రంగా మీ ముందుకు తీసుకోస్తాo.