Trivikram Clarified A..Aa Is From Meena Novel


After announcing release date of A Aa finally Trivikram said a shocking news.We all know that there is a news rounding about this movie that is Yadhana Pudi sulochana wrote a novel named Meena which is taken by trivikram as it is as A Aa and did not even mentioned her name in name  cards. finally Trivikram spoke about this at the success meet of A aa.

He said "Thanks for giving success with A Aa, before starting this movie I spoke with Yadhana Pudi Sulochana.She only said me some changes in characters.I should write her name on name cards,actually we wrote her name in thankyou cards but with some technical issues her name is Not displayed on screen.with using technology in 48 hours her name will be displayed on screen.from this I'm thinking that this issue will stop here." You are a dialogue writer in movies but public will notice everything Sir.

 అ..ఆ క‌థ అంతా  ఆమెదే..
   అ..ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర నుంచి ఏ మాట  మాట్లాడ‌కుండా ఎట్ట‌కేల‌కు  ఓ విషయంపై ఇన్నాళ్లకు గురూజీ నోరు తెరిచి స్పందించారు. సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి ఓ వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. య‌ద్ద‌నపూడి సులోచ‌నా రాణి రాసిన మీనా అనే న‌వ‌ల‌ను యాజిటీజ్ గా అ..ఆ పేరుతో తెర‌కెక్కించిన త్రివిక్ర‌మ్ కనీసం నేమ్ కార్డ్స్ లో కూడా ఆమె పేరు వేయ‌కుండా ఆమెకు అన్యాయం చేశార‌నే మాట వినిపించింది. అ..ఆ స‌క్సెస్ మీట్  లో నోరు విప్పి మాట్లాడాడు త్రివిక్రమ్. మొద‌ట ఈ వివాదం గురించి వివ‌ర‌ణ తోనే త‌న ప్ర‌సంగాన్ని మొద‌లుపెట్టిన త్రివిక్ర‌మ్, ఈ మూవీని ఇంత పెద్ద స‌క్సెస్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు. సినిమాను స్టార్ట్ చేసేముందే నాకు ఎంతో ఇష్ట‌మైన రైట‌ర్ య‌ద్ద‌నపూడి సులోచ‌నా రాణిగారితో మాట్లాడాను. ఆమె నుంచి క్రియేటివ్ ఇన్  పున్ తీసుకుని, ఆమె కూడా కొన్ని క్యారెక్ట‌ర్స్ కు సంబంధించి కూడా మార్పులు చెప్పారు. ఒక‌రకంగా చెప్పాలంటే మూల‌క‌థ‌కు య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి గారి పేరు వేయాలి. నిజానికి ఆమె పేరును థ్యాంక్స్ కార్డ్ వేశాం కాని టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్స్  వ‌ల్ల డిస్‌ప్లే కాలేదు. ఇప్ప‌టి టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని 48 గంట‌ల్లోనే ఆమె పేరు డిస్ ప్లే వ‌స్తుంది. ఇక్క‌డితో ఈ వివాదం ముగిసిపోతుంద‌ని అనుకుంటున్నా. ఇంకా  మాట్లాడాల‌ని అనుకుంటే నేను చేయ‌గ‌లిగేది ఏం లేదు అని చెప్పాడు త్రివిక్ర‌మ్. మీరు మాటల మాంత్రికుడు కాబట్టి.. మాటలతో మాయ చేసేయడం సినిమాల వరకే సరిపోతుండీ.. బైట జనాలు అన్నీ గమనిస్తారు కదా త్రివిక్రమ్ జీ!