త్రిష కోరిక నెర‌వేరుతుందా..?


త్రిష తన అభిమాన కథానాయకుడు రజనీకాంత్ అని చాలా ఇంటర్వ్యూలలో చెబుతూ ఉండేది. తాను కెరియర్ ను ఆరంభించి చాలాకాలమే అయినా, రజనీతో నటించే ఛాన్స్ రాకపోవడం బాధ కలిగించే విషయమని ఫీలయ్యేది. రజనీతో నటించే ఛాన్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని ఆసక్తిని వ్యక్తం చేసేది. అలాంటి త్రిష కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది. రజనీకాంత్ కథానాయకుడిగా రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ధనుష్ తో త్రిషకి మంచి స్నేహం వుంది. ఈ కారణంగానే రజనీ సినిమాలో త్రిషకి అవకాశం వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.