Trisha Back Back To With Horror


లండ‌న్ ని భ‌య‌పెడుతున్న 'మోహిని'
 
అంద‌రి లానే త‌ను కూడా హీరోయిన్ ఓరియంటెడ్ పాత్ర‌లు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంది త్రిష‌. హార‌ర్ సినిమాలు చేయ‌డానికి కూడా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న త్రిష‌, 'నాయ‌కి' త‌రువాత ఆమె మ‌రో సినిమాకు సైన్ చేసింది. అదే 'మోహిని'. నిన్న‌నే లండ‌న్ లో మొద‌లైన ఈ సినిమా షూటింగ్ కి మాదేశ్ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇటీవ‌ల త్రిష న‌టించిన క‌ళావ‌తి ఆడియ‌న్స్ ను బాగానే భ‌య‌పెట్టింది. ఈమె న‌టించిన మ‌రో హార‌ర్ నాయ‌కి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీని త‌ర్వాత వెంట‌నే మోహిని సినిమా ఒప్పుకోవ‌డం, బ్యాక్ టు బ్యాక్ త్రిష హార‌ర్ సినిమాలే చేయ‌డం వెనుక ర‌హ‌స్యం ఏమీ లేద‌ని ,అనుకోకుండా అలా వ‌చ్చేశాయంటోంది త్రిష‌.