Trailer Talk : Sahasam Swasaga Sagipo


                                       Trailer Talk : Sahasam Swasaga Sagipo
 

Akkineni hero Naga chaitanya stylish director Gowtham Menon directional Sahasam swasaga saagipo trailer released few hours back. Fans are expecting Ye maya chesave range movie again from Gowtham Menon

A scene in which Naga chaitanya was beaten by the girl and the reaction given by the chaithu is extraordinary. He lived in the character. Starting with love scenes trailer again enters into action mode. by seeing trailer we can understand that a middle class boy who falls in love and got some problem.We also understands that police character by the Baba saighal has some negative shade in the movie.

movie is totally stylish in Gowtham Menon style.AR rehman is the music director and malyali beauty Manila mohan plays a female lead.Trailer got some good response. Audience are waiting eagerly for the movie.This movie is planning to release on July 15th.

                                                        దేనికీ భ‌య‌ప‌డ‌నంటున్న చైతూ
 
అక్కినేని కుర్రాడు నాగ‌చైత‌న్య హీరోగా, స్టైలిష్ చిత్రాల ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను కొద్ది సేప‌టి క్రితం నాగ‌చైతన్య త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ బావుంద‌ని, నాగ‌చైత‌న్య‌, గౌత‌మ్ మీన‌న్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ చిత్రం ఏ మాయ చేశావే రేంజ్ లో హిట్ అవుతుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు.
ట్రైల‌ర్ మొద‌ట్లోనే అమ్మాయి చేత్తో చెంప‌దెబ్బ తినే సీన్. ఆ సీన్ కి నాగ‌చైతన్య ఇచ్చిన రియాక్ష‌న్ మామూలుగా లేదు. జీవించేశాడు. మొద‌ట ల‌వ్ సీన్ల‌తో స్టార్ట్ అయ్యే సినిమా త‌ర్వాత యాక్ష‌న్ మోడ్ లోకి వెళుతుంద‌ని ట్రైల‌ర్ ను బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. ట్రైల‌ర్ చూస్తుంటే సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడి జీవితం ప్రేమ త‌ర్వాత అనుకోని మ‌లుపుల‌తో సినిమా స్టోరీ లైన్ ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. పోలీస్ పాత్ర‌లో క‌నిపించిన బాబా సెహ‌గ‌ల్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.
సినిమా మొత్తం గౌత‌మ్ త‌ర‌హా స్టైలిష్ టేకింగ్ లోనే ఉండ‌నుంద‌ని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్తుంది. ఏ. ఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చైతూ సర‌స‌న న‌టించిన‌ మ‌ల‌యాళ న‌టి మంజిమా మోహ‌న్ కూడా త‌న న‌ట‌న‌తో ట్రైల‌ర్ లో మెప్పించింది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన మూడు పాట‌లకు మంచి రెస్పాన్స్ రావ‌డం, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ బావుండ‌టంతో ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జులై 15న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి మూవీ యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.
 

Trailer Rating: 3.5/5

https://www.youtube.com/watch?v=9kd3lOprII8