ర‌వితేజను ట‌చ్ చేసి చూడండి


'మాస్ మహారాజా' రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందనుంది.బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు .జనవరి 26 (గురువారం) రవితేజ బర్త్ డే సందర్భంగా  ఈ సినిమా వివరాలను దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ - "మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేసారు. ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం." అని తెలిపారు. దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ - "ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్.ఇందులో ఇద్దరు కథానాయకులుంటారు. ఇప్పటికే రాశి ఖన్నాను ఎంపిక చేసాం. మరొక నాయికను త్వరలోనే ప్రకటిస్తాం.హేమాహేమీలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తున్నారు" అని చెప్పారు.
touch chesi chudu ఈ చిత్రానికి.. సంగీతం : ప్రీతమ్స్ ఎ అండ్ ఆర్ వెంచర్ జామ్ 8 కథ :  వక్కంతం వంశీ. స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్. మాటలు : శ్రీనివాస్ రెడ్డి. అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి, మల్లు ఎడిటింగ్ : గౌతం రాజు. ఆర్ట్: రమణ. కో డైరెక్టర్ : రాంబాబు. ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్. యాక్షన్ : పీటర్ హేన్స్. నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ. దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.