Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Tollywood Heroes And Heroiens In Social Activities


 మేము సైతం
స్టార్స్ గా వెలిగిపోయే అవ‌కాశం అంద‌రికీ రాదు. కొంద‌రు మాత్ర‌మే ఆ స్థాయికి చేరుకోగ‌లుగుతారు. కానీ ఆ స్థాయికి వెళ్లాక స‌మాజ సేవ చేయాల‌నే ఆలోచ‌న కూడా అంద‌రికీ రాదు. ఏదో నాలుగు రాళ్లు వెన‌కేసుకోవ‌డం త‌ప్ప‌, మంచి చేద్దాం అనే ఆలోచ‌న అంద‌రికీ రాదు. కానీ మ‌న స్టార్ల‌లో కొంత‌మంది మాత్రం త‌మ‌కు ఇంత ఇచ్చిన సొసైటీకి ఏదొక‌టి ఇచ్చేయాలి అన్న ఆలోచ‌న‌లో త‌మవంతు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నారు.
ఇప్ప‌టికే రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్న మ‌హేష్ బాబు ఆ గ్రామాల‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తూనే, హీల్ ఎ చైల్డ్ ఫౌండేష‌న్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా బాధ్య‌త‌లను నిర్వ‌ర్తిస్తున్నాడు. నాగార్జున త‌ను అవ‌య‌వదానం చేయ‌డంతో పాటు, స‌మాజంలో ఉండేవాళ్లకు కూడా ఇలా చేయ‌మ‌ని క్యాంప‌న్ చేస్తున్నాడు. ఇక బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ ద్వారా బాల‌కృష్ణ సేవ చేస్తుంటే, చిరంజీవిని ఫాలో అవుతూ రామ్ చ‌ర‌ణ్ బ్ల‌డ్ డొనేష‌న్ పై ఓ స్పెషల్ యాప్ ను క్రియేట్ చేయించ‌డంతో పాటు, షీ టీమ్స్ అంటూ విమెన్ సేఫ్టీ క్యాంపైన్ కు అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. 
ఇక హీరోయిన్ల‌లో అయితే ఛారిటీ ప‌నుల్లో ప్ర‌తి దానికీ నేనున్నా అంటూ ముందుకొచ్చే స‌మంత‌కు ఫ‌స్ట్ ప్లేస్ ఇవ్వాలి. ప్ర‌త్యూష అనే ఒక ఎన్జీఓ ద్వారా త‌ను చేస్తున్న సేవ‌లు మామూలువి కావు. అలాగే మోహ‌న్ బాబు వార‌సురాలిగా ల‌క్ష్మి మంచు ప్ర‌తి చిన్నవిష‌యానికి స్పందిస్తూ అంద‌రికీ తోచిన స‌హాయం చేయ‌డంలో ముందుంటుంది. ఈమ‌ధ్య ఓ ఎంట‌ర్ టైన్ మెంట్ లో వ‌స్తున్న మేము సైతం అనే షో ద్వారా ఎంతో మంది బ‌తుకుల‌ను తీర్చిదిద్దుతూ, త‌న మాన‌వ‌త్వాన్ని చాటుతుంది. ఇక టీచ్ ఎయిడ్స్ క్యాంపైన్ కు స‌పోర్ట్ చేస్తున్న శృతిహాస‌న్ యువ‌త‌లో మార్పు కోసం త‌నే ఒక పాట‌ను సైతం పాడి, రిలీజ్ చేసింది.