Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Titanic Gets U/A


సెన్సార్ పూర్తి చేసుకున్న‘టైటానిక్’
 
రాజీవ్ సాలూరి, యామిని భాస్క‌ర్ హీరో హీరోయిన్లుగా చందర్ రావ్ సమర్పణలో క‌న్నా సినీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న  చిత్రం ‘టైటానిక్’. ‘అంత‌ర్వేది టు అమ‌లాపురం’ ట్యాగ్ లైన్. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...
స‌హ నిర్మాత అట్లూరి సురేష్‌బాబు మాట్లాడుతూ ‘’’టైటానిక్’ చిత్రం ఫుల్ ప్యామిలీ కామెడి ఎంటర్‌టైన‌ర్‌. ‘అంత‌ర్వేది నుండి అమ‌లాపురం’ వ‌ర‌కు గోదావ‌రి న‌దిలో టైటానిక్ అనే లాంచీలో జ‌రిగే క‌థే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా న‌టిస్తుంటే ర‌ఘుబాబు విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అలాగే జ‌బ‌ర్‌ద‌స్త్ టీం, జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఏఎన్నార్, జూనియర్ కృష్ణ, జూనియర్ పవన్ కళ్యాణ్ కామెడి సినిమాకు ప్లస్ అవుతుంది. రాజమండ్రిలో పేరుగాంచిన వశిష్ఠ అనే యాత్ర బోట్ ను టైటానిక్ గా రూపొందించి షూటింగ్ చేశాం. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. రీసెంట్ గా యాజమాన్య సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్స్ కు మంచి స్పందన వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా ఎంటర్ టైనింగ్ ఉందని యూనిట్ ను అభినందించారు. రాజవంశీ సినిమా చాలా చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు.
              పృథ్వీ, ర‌ఘుబాబు, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్ః స్వామిరారా, పిల్ల జమీందార్ చిత్రాల ఫేమ్ చంద్రకిరణ్, ఫైట్స్ః రాం సుంక‌ర‌, ఆర్ట్ః ర‌ఘుకుల‌క‌ర్ణి.కె, మ్యూజిక్ః వినోద్ యాజ‌మాన్య‌, ఎడిట‌ర్ః ఎమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీః అమర్, స‌హా నిర్మాతః అట్లూరి సురేష్ బాబు, నిర్మాతః కె.శ్రీనివాస‌రావు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: జి.రాజ‌వంశీ.