రాజ‌మౌళికి షాకిచ్చిన మ‌ల‌యాళ ద‌ర్శ‌క నిర్మాత‌లు


ఇప్పుడు ద‌ర్శ‌కుల దృష్టంతా మ‌హా భార‌తం పైనే ఉంది. ఆ మ‌ధ్య మ‌హా భార‌తం ను ఒక్కో భాగంగా, పూర్తి స్థాయిలో తెర‌కెక్కించాల‌ని ఉంద‌ని దాస‌రి చెప్పారు. మొన్నీమ‌ధ్య‌, మ‌హా భార‌తం ను భారీ స్థాయిలో తెర‌కెక్కించి, పెద్ద రేంజ్ లో రిలీజ్ చేయడం త‌న డ్రీమ్ అని రాజ‌మౌళి కూడా చెప్పాడు. కానీ ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ల‌డానికి చాలా స‌మయం ప‌డుతుంద‌ని, త‌న ఊహ‌ల‌కు అందుబాటులో ఉన్న టెక్నాల‌జీ వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా మ‌హా భార‌తంను కార్య‌రూపం దాలుస్తాన‌ని రాజ‌మౌళి చెప్పాడు. ఇక రీసెంట్ గా షారుఖ్ కూడా త‌న‌కు మ‌హా భార‌తం ను నిర్మించాల‌ని ఉంద‌న్నారు.

ఇలా అంద‌రి దృష్టి మ‌హా భార‌తంపై ఉన్న నేప‌థ్యంలోనే మ‌ల‌యాళ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఒక అడుగు ముందుకు వేసి మ‌రీ, రూ.1000 కోట్ల బ‌డ్జెట్ తో ఈ గొప్ప సినిమాకు శ్రీకారం చుట్టారు. శ్రీకుమార్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న, ఈ సినిమాకు బి.ఆర్ శెట్టి అనే ప్ర‌ముఖ వ్యాపార వేత్త ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు. మోహ‌న్ లాల్ భీముడిగా న‌టించనున్న ఈ సినిమాకు ది మహాభార‌త అనే టైటిల్ ను కూడా ఆల్రెడీ సినిమాకు ఫిక్స్ చేసేశారు. ఈ సినిమాను తెలుగు ,త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రెండు భాగాలుగా రూపొందించ‌నున్నారు.