Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

తెలంగాణ మూవీ యూనియన్‌ డైరీ ఆవిష్కరణ


తెలంగాణ మూవీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ ప్రచురించిన నూతన సంవత్సర డైరీని ప్రముఖ నిర్మాత, ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు సి. కళ్యాణ్‌ ఇటీవల ఫిలిం ఛాంబర్‌లో ఆవిష్కరించారు. యూనియన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు శివశంకర్‌(అపురూప్‌) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రముఖ నిర్మాత, ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు సి. కళ్యాణ్‌, ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఎస్‌ఎల్‌ గ్రూప్‌ అధినేత ననావత్‌ నాయక్‌, సెక్టార్‌ ఛైర్మన్‌ పి.సత్యారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌, ఎస్‌ఎల్‌ అసోసియేట్స్‌ ఛైర్‌పర్సన్‌ గంప సిద్ధలక్ష్మీ, నోవా గ్రూఫ్‌ కాలేజెస్‌ ఛైర్మన్‌ ముత్తంశెట్టి కృష్ణారావు, ఇరు రాష్ట్రాల ఆర్‌ఐఏ(రైట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ కమీషన్‌) కమీషనర్‌ ముత్తంశెట్టి విజయనిర్మల, డైరీ ప్రచురణ కర్త ఓం సాయిగురు డిజిటల్స్‌ అధినేత కొల్లూరు శ్రీకాంత్‌, దర్శకులు తాడినాడ రాజసింహ దర్శకుల సంఘం అధ్యక్షులు మురళీ లను శివశంకర్‌ (అపురూప్‌) ఆధ్వర్యంలో యూనియన్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన శివశంకర్‌ (అపురూప్‌) మాట్లాడుతూ..మా యూనియన్‌కి గౌరవ సలహాదారుగా ఉండాలని శ్రీ చేజర్ల ఇంద్రకుమార్‌ రాజు(ఇంద్రాణి చారిటబుల్‌ ట్రస్ట్‌, కువైట్‌) గారిని అడగగానే..మీ సంక్షేమం కోసం నావంతు కృషి చేస్తానని, సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి, డైరీ ప్రచురణకు ముఖ్య కారకులైనారు. అలాగే ఎస్‌ఎల్‌ గ్రూప్‌ అధినేత ననావత్‌ నాయక్‌ గారు యూనియన్‌ సంక్షేమం కోసం 25వేల రూపాయల చెక్కును అందచేశారు. అలాగే కొల్లూరు శ్రీకాంత్‌ గారి సహకారం కూడా మరువలేనిది. ఈ ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నావంతుగా యూనియన్‌ సభ్యుల శ్రేయస్సు కోసం నా శాయశక్తులా కృషిచేస్తాను. 300 మంది సభ్యులున్న మా యూనియన్‌ నెలరోజుల్లోపే 525కి చేరడంని బట్టి నాపై ఎంతగా బాధ్యత ఉందో తెలుసుకున్నాను. యూనియన్‌ తరుపున 12 మంది టాస్క్‌ఫోర్స్‌ సభ్యులను నియమించి అన్ని సమయాల్లో యూనియన్‌కి అందుబాటులో ఉండేలా చూస్తాను. అలాగే సభ్యులకు గృహవసతి, భీమా సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తాను. ఇక చివరిగా మా యూనియన్‌ డైరీ ఆవిష్కణ గావించిన సి. కళ్యాణ్‌ గారికి, వారందిస్తామన్న తోడ్పాటుకి యూనియన్‌ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము...అని అన్నారు.