Tarak Fans In Chennai


చెన్నైలో తార‌క‌రాముడి ద‌ర్శ‌నం కోసం
 
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న జ‌నతా గ్యారేజ్ షూటింగ్ చెన్నైలో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో కొన్ని పోరాట స‌న్నివేశాల‌ను అక్క‌డ చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ స్పాట్ ఎక్క‌డో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తెలిసిపోయింది. దీంతో అభిమానులు త‌మ హీరోని చూడ‌టానికి భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఎన్టీఆర్ ను చూడ‌టానికి వ‌చ్చిన వారంతా క్యూలో నుంచోవ‌డం ఆయ‌న ప‌ట్ల వాళ్ల‌కు గ‌ల అభిమానానికి అద్దం ప‌ట్టింది. ఈ విష‌యాన్ని తార‌క‌రాముడి ద‌ర్శ‌నం కోసం చెన్నైలో ట్రాఫిక్ జామ్ అంటూ ఫేస్ బుక్ లో ఫోటో పెట్టి మ‌రీ పోస్ట్ చేశాడు బ్ర‌హ్మాజీ.త‌న‌కోసం త‌ర‌లివ‌చ్చిన అభిమానుల‌ను ఎన్టీఆర్ ఆత్మీయంగా ప‌ల‌క‌రించి, వాళ్ల‌కి ఆనందాన్ని క‌లిగించాడు జూనియ‌ర్.