Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Tamannah In Abhinetri Movie


త‌మ‌న్నాని ఇలా చూడ‌గ‌ల‌మా..?
గ్లామ‌ర్ కి కేరాఫ్ లా ఉండే త‌మ‌న్నా ని మేక‌ప్ లేకుండా అస‌లు ఊహించుకోలేం అలాంటిది ఏకంగా సినిమాలోనే మేక‌ప్ లేకుండా క‌నిపిస్తే..? అప్పుడెప్పుడో ఓ తమిళ్ మూవీలో మేక‌ప్ లేకుండా క‌నిపించింది త‌మ‌న్నా. ఆ సినిమా తెలుగులోకి కూడా డ‌బ్ అయింది. త‌మ‌న్నా అంటేనే గ్లామ‌ర్, చ‌లాకీ, తెలుగులో గ‌లగ‌లా మాట్లాడేయ‌గ‌ల త‌మ‌న్నా బ‌య‌ట ఎంత యాక్టివ్ గా ఉంటుందో, సినిమాల్లోనూ అంత‌కు పదింత‌లు ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి త‌మ‌న్నా మేక‌ప్ లేకుండా డ‌ల్ గా క‌నిపిస్తే ఎలా..? అప్పుడెప్పుడో మేక‌ప్ లేకుండా న‌టించ‌డానికి సాహ‌సం చేసిన త‌మ‌న్నా, మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు అభినేత్రి కోసం ఆ సాహ‌సం చేసింది. ఇందులో త‌మ‌న్నా డ‌బుల్ రోల్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక రోల్ లో మోడ్ర‌న్ గా క‌నిపిస్తే, ఇంకో రోల్ లో అస్స‌లేమాత్రం గ్లామ‌ర్ లేకుండా క‌నిపించ‌నుంద‌ట‌.
త‌మ‌న్నా ని ఈ గెట‌ప్ లో చూడ‌టం నిజంగా చాలా క‌ష్టం. సినిమా టీజ‌ర్ లాంచ్, ఫ‌స్ట్ లుక్ లాంచ్ కు కూడా త‌మ‌న్నా పూర్తి నాటు లుక్ క‌నిపించింది. సినిమాలో ఓకే, మ‌రి బ‌య‌ట కూడా త‌మ‌న్నా ఎందుకు అలా ఉండ‌టం..తెలుగు,త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో త‌మ‌న్నాతో పాటు ప్ర‌భుదేవా, సోనూసూద్ లు కూడా న‌టిస్తున్నారు.