బాల‌య్య కోసం రేస్‌లో ఇద్ద‌రు హీరోయిన్స్..


గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి త‌ర్వాత బాల‌కృష్ణ స్థాయే మారిపోయింది. త‌న 101 వ చిత్రం ఎవ‌రితో చేస్తాడా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న త‌రుణంలో డాషింగ్ డైర‌క్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తో త‌న త‌ర్వాతి చిత్రం అని అంద‌రికీ షాక్ ఇచ్చాడు బాల‌య్య‌. అప్ప‌టినుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పైన మంచి అంచనాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న ఎవ‌రు న‌టించ‌నున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.బాల‌య్య స‌ర‌స‌న న‌టించేందుకు ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్లు సైతం క్యూ కడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ ఛాన్స్ ఎవ‌రికి రానుందో అనే ప్ర‌శ్న అభిమానుల‌కు ఉర్రూత‌లూగిస్తుంది. 

బాల‌కృష్ణ స‌రే అనాలే కానీ, మ‌ర్నాడు వ‌చ్చి సెట్ లో వాలిపోవ‌డానికి స్టార్ హీరోయిన్లు రెడీ గా ఉన్నారు. బాల‌కృష్ణ తో న‌టించాల‌ని ఉంద‌ని ఇటీవ‌లే త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ఇక అమ‌లా పాల్ కూడా బాల‌య్య‌తో జోడీ క‌ట్టాలనే ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది. ఈ నేప‌థ్యంలో మరి బాల‌య్య వారిద్ద‌రిలో ఎవ‌రికి ఓటేస్తాడో, లేదంటే వేరే హీరోయిన్స్ తో జోడీ క‌డ‌తాడో చూడాలి.