సినీ ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం ప‌లుకుతున్న మంత్రి


సినిమా ఇండ‌స్ట్రీ అభివృద్ధికి, చిన్న సినిమాని బ‌తికించ‌డానికి తెలంగాణ రాష్ట్ర‌ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాదవ్ చేస్తున్న కృషి మ‌రువ‌రానిది. అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయాక సినీప‌రిశ్ర‌మ ఎటూ త‌ర‌లి వెళ్ల‌కుండా ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా నిలిచిన మంత్రివ‌ర్యులుగా ఆయ‌న ప‌రిశ్ర‌మ వ‌ర్గాల నుంచి మ‌న్న‌న‌లు పొందారు. ప్ర‌జ‌లు, ప‌రిశ్ర‌మ‌ నుంచి అభిమానం సంపాదించుకున్నారు. చిన్న సినిమా పురోభివృద్ధికి థియేట‌ర్ల‌లో ఐదో ఆట‌ను కేటాయించాల్సిందిగా ప్ర‌భుత్వ‌ అనుమ‌తి తేవ‌డంలోనూ, అత్యంత కీల‌క‌మైన సింగిల్ విండో అనుమ‌తుల విధానానికి అంకురార్ప‌ణ చేయ‌డంలోనూ అటు ప్ర‌భుత్వానికి, ఇటు ప‌రిశ్ర‌మ‌కు వార‌ధిగా నిలిచారు త‌ల‌సాని. అంత‌ర్జాతీయ స్థాయి సినిమా ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు, బాల‌ల చ‌ల‌న‌చిత్రోత్స‌వాల‌ను ప్రోత్స‌హించేందుకు త‌న వంతు కృషి చేస్తున్నారు. 
 
సినిమా ప‌రిశ్ర‌మ అన్నా.. క‌ళాకారులు అన్నా ఆయ‌న‌కు విప‌రీత‌మైన అభిమానం. అందుకే త‌న ఇంట ఏ శుభ‌కార్యం జ‌రిగినా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్ని ప్ర‌త్యేకంగా ఆహ్వానిస్తుంటారు. త‌ల‌సాని ద్వితీయ పుత్రిక చి.ల‌.సౌ స్వాతికి చి.ర‌వికుమార్ యాద‌వ్‌తో వివాహం సంద‌ర్భంగా సినీప‌రిశ్ర‌మ‌లోని ఆత్మీయులంద‌రినీ న‌వంబ‌ర్ 13న హైద‌రాబాద్ - హెచ్ఐసీసీ- నోవాటెల్ వేదిక‌గా విందు కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. సాయంత్రం 7 గంట‌ల నుంచి విందు కార్య‌క్రమంలో త‌న కుమార్తెను ధీవించాల్సిందిగా సినీప్ర‌ముఖుల్ని త‌ల‌సాని కోరారు.