Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

సైరా మొద‌లెట్టేశారు.. ఇక ఆగేదే లేదు


ఖైదీ నెం.150 తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు, త‌న త‌ర్వాతి సినిమాగా చారిత్రాత్మ‌క చిత్రం తీయాల‌ని భావించి, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితంపై బ‌యోపిక్ ను తీయ‌డానికి రెడీ అయి, ఎంతో కాలం నుంచి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌లుపెట్టేశారు. మెగా స్టార్ చిరంజీవితో స‌హా న‌టీన‌టులంద‌రికీ టెస్ట్ షూట్ లు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్ర తొలి షాట్ ఇవాళ అధికారికంగా ప్రారంభ‌మైంది. ఉద‌యం 7.30 గంట‌ల‌కు చిరంజీవి, బ్ర‌హ్మాజీ ల‌పై తొలి షాట్ చిత్రీక‌ర‌ణ చేప‌ట్టారు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. హైదరాబాద్ ప‌రిస‌రాల్లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో భారీగా నిర్మించిన సెట్ లో ఈ షాట్ ను తెర‌కెక్కించారు. ప‌లువురు న‌టీన‌టులు, ఇంగ్లీష్ యాక్ట‌ర్స్ పాల్గొన్న ఈ చిత్ర తొలి షెడ్యూల్  మొత్తం ఈ సెట్ లో జ‌ర‌గ‌నుంది. 

ఈ క‌థ‌ను ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అందించగా, ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ఆ క‌థకు చాలా మార్పులు చేర్పులు చేసి తుది మెరుగులు దిద్దాడు. మొద‌ట్లో ఎఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తాడ‌నుకున్న‌ప్ప‌టికీ త‌న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల ఈ ప్రాజెక్టు నుంచి రెహ‌మాన్ త‌ప్పుకోవ‌డంతో మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. చారిత్రాత్మ‌క చిత్రం కావ‌డం, భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుండ‌టం వ‌ల్ల కాస్త ఆలస్యంగా అయినా స‌రే మంచి అవుట్ పుట్ తో సినిమాను తెర‌కెక్కించి, 2019 సంక్రాంతి కి విడుద‌ల చేయాల‌ని సైరా టీమ్ భావిస్తుంది.