Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

'వైశాఖం'లో స్వచ్ఛ భారత్‌


డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ దాదాపు పూర్తవుతుంది. 
ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''మా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో వస్తున్న మరో సూపర్‌హిట్‌ చిత్రం 'వైశాఖం'. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేసేలా ఈ చిత్రం రూపొందుతోంది. సాధారణంగా సినీ ప్రముఖులు స్వచ్ఛ భారత్‌ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతూనే వున్నారు. అయితే స్వచ్ఛ భారత్‌ గురించి 'వైశాఖం' చిత్రంలో స్వచ్ఛ భారత్‌కి సంబంధించి ఓ సీన్‌ని చిత్రీకరించడం జరిగింది. చిత్రంలోని ప్రముఖ తారాగణం అంతా పాల్గొన్న ఈ సన్నివేశం కథలో భాగంగానే వుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌తోపాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్న 'వైశాఖం' తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కజక్‌స్థాన్‌లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అవుతాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. అక్టోబర్‌ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ దాదాపు పూర్తవుతుంది'' అన్నారు. 
హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఫైట్స్‌: రామ్‌ సుంకర, ఆర్ట్‌: మురళి కొండేటి, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.