Sukumar Writings New Movie


Create director Sukumar got his separate mark in the people.he also proved as producer as well with "Kumari 21f" and got huge applause. Now he is producing a new movie again named as "Director"  with tagline Her love is fashion. He is introducing Ashok as hero and Hari Prasad pakka as Director for this film. In sukumar writings banner Bncsp Vijay Kumar,Thomos Adhuri, Sari sridhar ravichandra producing this film. Anthaku mundhu ah tarvatha fame Eesha is taken as female lead. Producers said This is a different concept love story going to sets on 9th of this month. This movie is liked by this generation. Story and screenplay will be very interesting.music is given by Sai karthik, cinematography by praveen vanamali.Editing by Navven,Art director Ram Chandra Singh.executive producer Ramesh,stroy screenplay dialogues directon by Hari Prasad Jakka
సుకుమార్ రైటింగ్స్ కొత్త చిత్రం  టైటిల్‌ దర్శకుడు
వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమారి 21ఎఫ్ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. కుమారి 21ఎఫ్‌తో తొలిప్రయత్నంలోనే నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న ఈ యువ దర్శకుడు.. నిర్మాతగా మరో విలక్షణమైన చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. దర్శకుడు టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి హర్ లవ్... హీజ్ ప్యాషన్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా అశోక్ అనే నూతన నటుడిని హీరోగా,   హరిప్రసాద్ జక్కాను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ సమర్పణలో బీఎన్‌సీఎస్‌పీ (bncsp) విజయ్‌కుమార్, ధామాస్ ఆదూరి, సత్తి నదీర్ రవిచంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంతకుముందు... ఆ తర్వాతఫేం ఇషా నాయికగా, రెండో నాయికగా పూజిత నటించనుంది. ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ఇదొక విభిన్నమైన ప్రేమకథా చిత్రం.  ఈ నెల 9 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నేటి యువతరం మెచ్చే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కథ, కథనాలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి అని తెలిపారు. అశోక్, ఇషా, పూజిత, బ్రహ్మాజీ, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఫోటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: రామచంద్రాసింగ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా, లైన్ ప్రొడ్యూసర్: వీఈవీకేడీఎస్  ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వంః హరిప్రసాద్ జక్కా..