Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

Sukumar On DSP Debut Movie


రాక్‌స్టార్ తెరంగేట్రం ఎన్న‌డో..?
ఆయ‌నొక మ్యూజిక‌ల్ సెన్సేష‌న్. త‌న సినిమాలోని ప్ర‌తి పాట‌ను డిఫ‌రెంట్ గా ఉండేలా కేర్ తీసుకుంటాడు. త‌న‌ని ఎక్క‌డ చూసినా త‌న యాక్టివ్ నెస్ కి దిమ్మ తిరిగిపోతుంది. కేవ‌లం మ్యూజిక్ డైర‌క్ట‌ర్ గా ఎందుకు, హీరో కావ‌డానికి అత‌నికి ఏం త‌క్కువ‌. త‌నే హీరో అయితే... అవును. మ‌న‌కి వ‌చ్చిన ఆలోచ‌నే సుకుమార్ కి కూడా వ‌చ్చిన‌ట్లుంది.
దేవి శ్రీ ప్ర‌సాద్. ఒక సింగ‌ర్ గా, మ్యూజిక్ డైర‌క్ట‌ర్ గా, లిరిసిస్ట్ గా, గెస్ట్ అప్పియ‌రెన్స్ ల్లో మ‌న‌ల్ని అల‌రించిన ఎనర్జీ బాంబ్. ఆడియో ఫంక్ష‌న్స్ లో, అవార్డ్ ఫంక్ష‌న్స్ లో స్టేజ్ పై దేవీశ్రీ చేసే గోల అంతా ఇంతా కాదు. సుకుమార్, దేవీశ్రీ మంచి ఫ్రెండ్స్ అని మ‌న‌కి తెలిసిందే.కుమారి 21 ఎఫ్ ఆడియో ఫంక్ష‌న్ లో స్వ‌యంగా సుకుమారే రాక్ స్టార్ హీరోగా ఒక సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. డీఎస్పీని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌నే ఆలోచ‌న త‌ర్వాత, త‌న తండ్రి స‌త్య‌మూర్తి మ‌ర‌ణించ‌డం, దీంతో కొన్నాళ్ల‌పాటు ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించే ప‌రిస్థితి చేయ‌లేక‌పోయాడు దేవీశ్రీప్ర‌సాద్.
ఆ త‌ర్వాత నాన్న‌కు ప్రేమ‌తో రిలీజ్, ఆ వెంట‌నే రామ్ చ‌ర‌ణ్ తో మూవీ ఫైన‌ల్ అవ‌డం జ‌రిగింది. దీంతో రామ్ చ‌ర‌ణ్ మూవీ ప‌నుల్లో ప‌డిపోయాడు సుకుమార్. చెర్రీ ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో చూపించాల‌న్న‌ది సుక్కు ఐడియా. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ చేస్తున్న త‌ని ఒరువ‌ని రీమేక్ త‌ర్వాత‌, సుకుమార్ తో ఫార్ములా ఎక్స్ స్టార్ట్ చేస్తాడు. అంటే ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యేవ‌ర‌కూ సుకుమార్ ఫుల్ బిజీనే అన‌మాట‌. అప్ప‌టివ‌ర‌కు దేవిశ్రీ ని మ‌నం సంగీత ద‌ర్శ‌కుడిగా మాత్ర‌మే చూడ‌గ‌లం.