స‌డెన్ గా ప్లాన్ మార్చేసిన సుకుమార్


రామ్ చ‌ర‌ణ్ త‌దుప‌రి సినిమా సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌నుందనే విష‌యం తెలిసిందే. పల్లెటూరి నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ పల్లెటూరి కుర్రాడిలా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా లో ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ పాల్గొనాల్సి ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ సెట్ లో అడుగు పెట్టింది లేదు.అస‌లు అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌రిగితే సినిమా యూనిట్ అంతా మొద‌టి షెడ్యూల్ కోసం విదేశాల్లో ఉండాల్సింది. మొద‌టి షెడ్యూల్ ను విదేశాల్లో పూర్తి చేసి, ఆ తర్వాత గోదావ‌రి జిల్లాలో మకాం వేద్దామ‌నుకున్న‌ది సుక్కు ప్లాన్. కానీ ఏం జ‌రిగిందో ఏమో తెలీదు కానీ స‌డెన్ గా సుకుమార్ ప్లాన్ మార్చేశాడ‌ట‌. 

ఈ సినిమాకు సంబంధించిన మొద‌టి షెడ్యూల్ ను గోదావ‌రి జిల్లాల్లోనే పూర్తి చేయాల‌ని, అది కూడా 35 రోజుల్లోనే ఆ షెడ్యూల్ ను పూర్తి చేయాల‌నే ప్లాన్ లో ఉన్నాడ‌ట సుక్కు. వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి రామ్ చ‌ర‌ణ్ కూడా సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. త‌న ప్ర‌తీ సినిమాలో హీరో ను కొత్తగా ప్ర‌జెంట్ చేసే సుక్కు ఈ సినిమాలో త‌మ అభిమాన హీరోను ఎలా చూపించ‌నున్నాడో అనే ఆస‌క్తి అభిమానుల్లో ఎక్కువైపోయింది.