సుదీప్, నిత్యా మీన‌న్ జంట‌గా 'కోటికొక్క‌డు'


సి.ఎల్.ఎస్ మ‌రియు ల‌గ‌డ‌పాట శ్రీనివాస్ గారు, గూడూరి గోపాల్ శెట్టి గారు ప్రేక్ష‌కుల‌కు అందిచుచున్న చిత్రం కోటికొక్క‌డు. ఈ చిత్రం త‌మిళ మ‌రియు క‌న్న‌డ భాష‌ల‌లో రిలీజ్ అయ్యి ఘ‌న విజ‌యం సాధించి సుమారు 120 కోట్ల‌కు పైగా భారీ క‌లెక్ష‌న్ల‌ను సాధించింది.ఇంకా థియేట‌ర్ల‌లో ఆడుతుంది. అలాంటి అద్భుత‌మైన చిత్రంలో సుదీప్ క‌థానాయ‌కుడిగా, నిత్యామీన‌న్ క‌థానాయిక‌గా.. లెజెండ్ డైర‌క్ట‌ర్ కె.ఎస్ ర‌వికుమార్ గారి ద‌ర్శ‌కత్వంలో ఇంత‌టి విభిన్న‌మైన చిత్రం ఎలాగైనాతెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌న్న సంకల్పంతో సి.ఎల్.ఎస్ మీడియా వారు ల‌గ‌డ‌పాటి శ్రీనివాస్ గారితో క‌లిసి ఈ కోటికొక్క‌డు అనే చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా ఘ‌న విజ‌యం సాధించి, భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకోవాల‌ని కోరుకుంటూ కంగ్రాచ్యులేష‌న్స్.


సుదీప్, నిత్యామీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్ కీల‌క‌పాత్ర పోషించారు. ఈ చిత్రానికి 


సాంకేతిక వ‌ర్గంః 

డైర‌క్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః రాజార‌త్నం

డైలాగ్స్ః శ‌శాంక్ వెన్నెల‌కంటి

సాహిత్యంః వెన్నెల‌కంటి, భువ‌న‌చంద్ర‌, రాకేందుమౌళి

సంగీతంః డి. ఇమ్యాన్

ఎడిట‌ర్ః ప్ర‌వీణ్ ఆంటోని

స్టంట్స్ః క‌ణ‌ల్ క‌న్న‌న్

క‌థః టి. శివ‌కుమార్

పి.ఆర్.ఓః బి.ఎ రాజు

నిర్మాతః కె. శిల్పిక‌

ద‌ర్శ‌క‌త్వంఃకె.ఎస్ ర‌వికుమార్