Latest News

నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా ఆనందో బ్ర‌హ్మ: కొంచెం న‌వ్వులు .... గంపెడు నీర‌సం ఆగ‌స్టు 21న సర్ ప్రైజ్ ఇవ్వనున్న అఖిల్ మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై ల‌క్ష్మి మంచు ప్ర‌ధాన పాత్ర‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.4 ప్రారంభం పవన్ కళ్యాణ్ పాటను ఆవిష్కరించిన 'మా' అధ్యక్షులు శివాజీరాజా మాఫియా నేపధ్యంలో "హైటెక్ కిల్లర్ " 'ఆనందోబ్ర‌హ్మ' మూవీ రివ్యూ ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం

శ్రీ‌వాస్ చేతుల‌మీదుగా `శేఖరం గారి అబ్బాయ్` మోష‌న్ పోస్ట‌ర్‌


అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై  హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం `శేఖరంగారి అబ్బాయ్`. విన్ను మద్దిపాటి, అక్షత నాయ‌కానాయిక‌లు. ఇటీవ‌ల‌ కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు లాంచ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ని ప్ర‌ముఖ దర్శ‌కులు శ్రీ‌వాస్ ఆవిష్క‌రించారు. 

ఈ సంద‌ర్భంగా శ్రీ‌వాస్ మాట్లాడుతూ -``ద‌ర్శ‌కురాలు, క‌థానాయిక అక్ష‌త‌కు గుడ్ ల‌క్‌. మంచి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది విజ‌య‌వంతంగా ముందుకు సాగాలి. మునుముందు మ‌రిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలి. చిత్ర‌యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. 

దర్శకురాలు, క‌థానాయిక‌ అక్షత మాట్లాడుతూ ``అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు. సూప‌ర్‌డూప‌ర్ హిట్ ఇచ్చిన ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు. అలాగే మోహ‌న్‌బాబు గారు ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేసి ఆశీస్సులు అందించారు. పెద్ద‌ల ఆశీస్సులు మాకు కావాలి. ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్న కొత్త‌వారికి, స్ట్ర‌గ్లింగ్ ఆర్టిస్టులు అంద‌రికీ మంచి జ‌ర‌గాలి`` అన్నారు. 

హీరో విన్ను మాట్లాడుతూ-`ల‌క్ష్యం, డిక్టేట‌ర్ లాంటి పెద్ద విజ‌యాలు ఇచ్చిన శ్రీ‌వాస్ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేయ‌డం వ‌రంలా భావిస్తున్నా. పెద్ద‌ల ఆశీస్సులు ఉత్సాహాన్నిచ్చాయి. పెద్ద విజ‌యం అందుకుంటాం. అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు`` అన్నారు. 

నిర్మాత మద్దిపాటి సోమశేఖర రావు మాట్లాడుతూ ``టాకీ పూర్త‌యింది. ఫ‌స్ట్‌లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. మోష‌న్ పోస్ట‌ర్ అంద‌రికీ న‌చ్చింది. త్వ‌ర‌లోనే పాటలు రిలీజ్ చేస్తాం`` అన్నారు. 

కార్యక్రమంలో సూర్య, అనురూప్ ,డి.ఎం.కె , సంగీత దర్శకుడు సాయి ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సాయి ఎలెందర్, కెమెరా: రాఘవ,  కూర్పు: నందమూరి హరి.