Srinivas Reddy Comments On Media


Srinivasr Reddy is in industry since 14 years by doing comedy roles.now a days he is doing some full length characters also.he has a disease since some days. Don't get surprised he has a disease of commenting everyone. Any disease can cure by Medicines but this disease is a danger one. Recently the words he spoke at the success meet of A..Aa are hot topic now. "We are very happy for the Movie result.But some web sites gave mixed reviews,those all should buy a stress ball as shown in this film so their stress will controlled"these words  was said by him at the success meet of A..Aa.Other side for the movie success unit are saying thanks to media he was over excited.In the movies he has all punch dialogues which he is using in real life also because he may feel stress.Anyone should buy him a stress ball.
 
 శ్రీనివాస్ రెడ్డికి  స్ట్రెస్ ఫీల్ ఎక్కువే
ఇండ‌స్ట్రీలో 14 ఏళ్ల నుంచి ఉంటూ, అప్ప‌టి నుంచి కామెడీ పాత్ర‌లు చేస్తూ, ఈ మ‌ధ్య‌నే కొన్ని సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసి పేరు తెచ్చుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి.ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శ్రీనివాస్ రెడ్డికి ఈ మ‌ధ్య ఓ రోగం వ‌చ్చింది. అదేంటి ఏమైంది, ఇన్నాళ్లు బాగానే ఉన్నాడు క‌దా.. రోగం అంటారేంటి అంటారేమో.. అవును ఈయ‌న గారికి నోటి దుర‌ద అనే జ‌బ్బు చేసింది. ఏ రోగం ఉన్నా న‌య‌మైపోతుందేమో గానీ, ఈ నోటిదుర‌ద ఉంటే మాత్రం చాలా క‌ష్టం. తాజాగా ఆయ‌న అ..ఆ స‌క్సెస్ మీట్ లో మాట్లాడిన మాట‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
''సినిమా పెద్ద హిట్.. చాలా సంతోషంగా ఉంది. కానీ వెబ్ సైట్ల‌లో మాత్రం ర‌క‌ర‌కాలుగా చూపిస్తున్నారు. వాళ్లంద‌రికీ సినిమాలో చూపించిన‌ట్లు ఒక బాల్ కొనుక్కోండి హ్యాపీగా పిసుక్కుంటే స్ర్టెస్ తగ్గుతుంది.అంద‌రూ బాగా స్ట్రెస్ లో ఉన్న‌ట్లున్నారు'' అంటూ కామెంట్లు  చేసి ఎక్స్‌ట్రాలు బాగానే మాట్లాడాడు శ్రీనివాస్ రెడ్డి.ఓ ప‌క్క సినిమా హిట్ అయినందుకు సినిమాటీమ్ అంతా మీడియాకు థ్యాంక్స్ చెబుతుంటే శ్రీనివాస్ రెడ్డి మాత్రం బాగా ఓవ‌ర్ ఎగ్జైట్ అయ్యాడు.మొదటినుంచి సినిమాల్లో సైడ్ నుంచొని అలాంటి ఎక్సట్రా డైలాగులు వేసీవేసీ ఇలాంటి మాటలు అలవాటు అయిపోయి రెడ్డిగారు కూడా పాపం స్ట్రెస్ ఫీల‌యిన‌ట్లున్నారు. పాపం ఎవ‌రొక‌రు ఓ స్ట్రెస్ బాల్  కొనిస్తే స‌రి. https://www.youtube.com/watch?v=ywgf80UsrHg