Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

చిరంజీవి 151సినిమాలో శ్రీకాంత్


చిరంజీవి, శ్రీకాంత్ ల మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. శ్రీకాంత్ నా త‌మ్ముడితో స‌మానం అని చిరూ చాలా సంద‌ర్బాల్లో చెప్పారు. శ్రీకాంత్ కూడా చిరూని అన్న‌య్యా అని చాలా ఆత్మీయంగా ప‌లక‌రిస్తారు. వీరిద్ద‌రి అనుబంధం శంక‌ర్ దాదా ఎంబీబీఎస్, శంక‌ర్ దాదా జిందాబాద్ సినిమాల్లోనూ క‌నిపించింది. ఇప్పుడు మ‌రోసారి ఈ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ తెర పంచుకోబోతున్నార‌ని తెలుస్తుంది. 

చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ఉయ్యాల‌వాడ న‌రసింహా రెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ కు ఒక కీల‌క పాత్ర ద‌క్కింద‌ట‌. చారిత్ర‌క నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డికి అనుచ‌రుడిగా శ్రీకాంత్ పాత్ర ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ కూడా న‌టించ‌నున్నార‌న్న ప్రచారం జోరుగా సాగుతుంది. రోబో2లో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్న అక్ష‌య్ కుమార్ ఈ చిత్రంలో కూడా న‌టిస్తే అక్ష‌య్ కుమార్ తెలుగులో న‌టించ‌నున్న రెండ‌వ చిత్రం ఇదే కానుంది.