Latest News

దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్ సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం హారర్ థ్రిల్లర్ "షాలిని' చిత్రం ప్లాటినం డిస్క్, సెప్టెంబర్ ఒకటి న విడుదల యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ నెల 21 నుంచి జీఎఫ్ఏ మిస్టర్ అండ్ మిస్ ఇండియా ఫైనల్స్..

రిలీజ్‌ అయిన శ్రీదేవి కొత్త చిత్రం 'మామ్‌' మోషన్‌ పోస్టర్‌


ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్‌'. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు మోషన్‌ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ వాయిస్‌ ఓవర్‌తో డిఫరెంట్‌గా, అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ మోషన్‌ పోస్టర్‌ రూపొందింది. ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ తర్వాత శ్రీదేవి నటిస్తున్న మరో మంచి చిత్రం 'మామ్‌'. ఆస్కార్‌ అవార్డ్స్‌ విజేత ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి, ఎడిటింగ్‌: మోనిసా బల్‌ద్వా, కథ: రవి ఉద్యవార్‌, గిరీష్‌ కోహ్లి, కోన వెంకట్‌, స్క్రీన్‌ప్లే: గిరీష్‌ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్‌, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్‌, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌, దర్శకత్వం: రవి ఉద్యవార్‌.