శ్రీ విష్ణుని ఈసారి అలా చూడొచ్చ‌మ‌న్న‌మాట‌..


నారా రోహిత్ తో కలిసి అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు అనే సినిమాతో హీరోగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న శ్రీ విష్ణు, ఇప్ప‌డు మా అబ్బాయి అనే సినిమాతో మ‌రొకసారి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. కుమార్ వ‌ట్టి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా మార్చి 17న విడుదల కానుంది.


ఈ సినిమా మీద అటు హీరోతో పాటూ, ఇటు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా చాలానే  ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ సినిమాను కుటుంబ స‌మేతంగా చూడొచ్చ‌ని, ద‌ర్శ‌కుడు ప్ర‌తీ పాత్ర‌ను ఎంతో స‌హ‌జంగా తెర‌కెక్కించాడ‌ని, ఈ సినిమాతో శ్రీవిష్ణు న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కుతాడ‌ని నిర్మాత‌లు ఎంతో బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు లోని రొమాంట‌క్ యాంగిల్ తో పాటూ, మాస్ యాంగిల్ ను కూడా ద‌ర్శ‌కుడు ఎంతో బాగా తెర‌కెక్కించాడ‌ట‌.