Sri Sri Running Towards Successfully


Super star Krishna, Vijaya nirmala and Senior Naresh in a key role Muppalaneni  Shiva directed a film called 'Sri Sri'. This movie was produced in SBS productions banner by Sri Saideep, Balu Reddy and Sheik Siraj jointly which is released on june 3rd which got huge applause form audience and running successfully in all theatres. So success meet is held on Monday
‘శ్రీశ్రీ సక్సెస్’ మీట్
సూప‌ర్ స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌, సీనియ‌ర్ న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించిన చిత్రం శ్రీ శ్రీ. ఈ చిత్రాన్ని ఎస్.బి.ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు  సోమవారం జరిగిన శ్రీ శ్రీ స‌క్సెస్ మీట్ లో..
సూపర్ కృష్ణ మాట్లాడుతూ...‘‘ ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా ఆడ‌ని దేశాల్లో కూడా శ్రీ శ్రీ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డం, అక్క‌డ కూడా మంచి రెస్పాన్స్ రావ‌డం సంతోషంగా ఉంది. శ్రీ శ్రీ చిత్రానికి ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. సినిమాలో చాలా చోట్ల డైలాగ్స్ కి క్లాప్స్ కొడుతున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌య‌సుల వాళ్లు ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత‌లు యంగ్ స్ట‌ర్స్, ఈ చిత్రంతోనే నిర్మాణ రంగంలో ప్ర‌వేశించారు. ముప్ప‌ల‌నేని శివతో క‌లిసి మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత‌ల‌ను అభినందిస్తున్నాను. మంచి కలెక్షన్స్ తో శ్రీ శ్రీ సూప‌ర్ హిట్ రేంజ్ కి వెళ్లాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్ట‌ర్ ముప్ప‌ల‌నేని శివ మాట్లాడుతూ...‘‘శ్రీశ్రీ వంటి సినిమాను కృష్ణగారితో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆరు సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత కృష్ణ గారు శ్రీ శ్రీ అనే మంచి సినిమాలో న‌టించారు అంటూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో కృష్ణ గారు అద్భుతంగా న‌టించారు. అన్ని కేంద్రాల్లో క‌లెక్ష‌న్స్ రోజురోజుకి ఇంఫ్రూవ్ అవుతున్నాయి. విదేశాల్లో ఆన్ లైన్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం. అక్క‌డ కూడా మా చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డం చాలా సంతోషంగా ఉంది. శ్రీ శ్రీ కృష్ణ గారి కెరీర్లో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
ఎంఫ్లిక్స్ అధినేత రాజు న‌డింప‌ల్లి మాట్లాడుతూ... ‘‘శ్రీ శ్రీ చిత్రాన్ని ఆన్ లైన్ లో కూడా రిలీజ్ చేసి కృష్ణ గారు  కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. మొరాకో, యుగాండ ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా రిలీజ్ చేయ‌ని దేశాల్లో కూడా శ్రీ శ్రీ చిత్రాన్ని రిలీజ్ చేసాం. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత కృష్ణ గారి సినిమా చూసే అకాశం క‌ల్పించారంటూ అక్క‌డ ఉన్న అభిమానులు అభినంద‌న‌లు తెలియ‌చేస్తుండ‌డం ఆనందంగా ఉంది. ఒక మంచి చిత్రాన్ని అందించినందుకు గ‌ర్వంగా ఉంది అన్నారు.
చిత్ర నిర్మాత‌లు శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్  మాట్లాడుతూ ‘‘శ్రీశ్రీ విడుదలైన అన్నీ చోట్ల మంచి రెస్పాన్స్ తో ముందుకు సాగుతుంది. ఇక్కడే కాకుండా ఓవర్ సీస్ లో మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. కృష్ణగారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.