మ‌హేష్ సినిమాకు అరుదైన రికార్డు


ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన #మ‌హేష్‌బాబు23 సినిమా ఫ‌స్ట్ లుక్, టైటిల్ రివీల్ అయ్యాయి. అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్ ఉండాలని ప‌ట్టు బ‌ట్టి మ‌రీ, ఇంగ్లీష్ టైటిల్ అయినా స‌రే స్పైడ‌ర్ కు ఓటేసి ఫైన‌ల్ చేశారు. ఆల్రెడీ స్పైడ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ ను కూడా పూర్తి చేసేశారు స్పైడ‌ర్ టీమ్. 

స్పైడ‌ర్ మూవీ శాటిలైట్ రైట్స్ ను ఓ ప్ర‌ముఖ టెలివిజ‌న్ సంస్థ భారీ మొత్తానికే సొంతం చేసుకుంది. తెలుగు, త‌మిళ‌తో పాటూ హిందీలో కూడా రిలీజ్ చేయ‌నున్న ఈ సినిమాకు మూడు భాష‌ల్లో క‌లిపి 26.5 కోట్ల రూపాయ‌లు చెల్లించి మ‌రీ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది ఆ ఛానెల్. టాలీవుడ్ సినిమాల్లో ఇది పెద్ద రికార్డ్ అనే చెప్పుకోవాలి. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు భారీ మొత్తంలో శాటిలైట్ రైట్స్ అమ్ముడ‌య్యాయి అంటే అది స్పైడ‌ర్ అనే చెప్పుకోవాలి. మురుగదాస్ డైర‌క్ష‌న్ లో వ‌స్తున్న ఈ సినిమాకోసం ఇప్ప‌టికే దాదాపుగా 100 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలుస్తోంది.

బ్ర‌హ్మోత్సవం ఫ్లాప్ అయిన త‌ర్వాత కూడా మహేష్ సినిమాకు ఇంత క్రేజ్ అంటే నిజంగా చెప్పుకోద‌గ్గ విష‌య‌మే. దానికి తోడు మురుగ‌దాస్ డైర‌క్ష‌న్ లో వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి ఆ మాత్రం హైప్ ఉంటుంది. ఈ చిత్రంతో మ‌హేష్ కొత్త రికార్డు సృష్టించే అవ‌కాశ‌ముంది. స్పైడ‌ర్ లో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తుంది.