ఏ ఛాన్స్‌నూ వదులుకునేలా లేదుగా..


సినీ ప‌రిశ్ర‌మ లో ఎప్పుడు ఎవ‌రికి ఎలాంటి అవ‌కాశం వస్తుందో ఎవ‌రికీ తెలియదు. వారానికో కొత్త హీరోయిన్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతూనే ఉంది. ఇలాంటి త‌రుణంలో  పాత హీరోయిన్స్ కు అవ‌కాశాలు చాలా అరుదుగా వ‌స్తాయి. అలా అరుదుగా వ‌చ్చిన అవ‌కాశాల‌ను కూడా కాళ్ల త‌న్నుకుంటే, వారికి ఇక అవి కూడా క‌రువే అవుతాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతుంది శ్వేత బ‌సు ప్ర‌సాద్.
 
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బొద్దుగుమ్మ మొద‌టి సినిమాతోనే విజ‌యం సాధించినా, త‌ర్వాత్త‌ర్వాత చెప్పుకోదగ్గ విజ‌యం ఒక్క‌టీ ఆమె ఖాతాలో లేదు. దీంతో ఆమె ఎక్క‌డ అవ‌కాశం దొరికితే దాన్ని త‌నకు వీలుగా మార్చుకుని, మంచి పేరు కొట్టేయాల‌ని చూస్తుంది శ్వేత బ‌సు. ఈ నేప‌థ్యంలోనే ఆమె హిందో సీరియ‌ల్స్ లో కూడా నటిస్తుంది. 
 
'చంద్రనందిని' గా శ్వేత బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర కానుంది. చంద్ర గుప్త మౌర్యుడి భార్య పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది శ్వేత బ‌సు. ప‌లువురికి ఆద‌ర్శ‌వంతంగా నిలిచిన ఈ పాత్ర అయినా త‌న‌కు మంచి పేరు తీసుకువ‌స్తుందేమో అన్న ఆశ‌తో ఉన్న శ్వేత‌, తెలుగు సీరియల్స్ లో అవ‌కాశం వ‌చ్చినా,చేయ‌డానికి సిద్ధంగా ఉన్నానంటోంది.