బాహుబలి కన్నా శతమానం భవతి చాలా బెటర్ !


చిన్న సినిమాని కాపాడండి అని అంతా అంటుంటారు . అయితే ఎవ్వరూ ఆ సినిమాలని పట్టించుకోరు. అయితే ఈ విషయంలో మిగతా నిర్మాతలతో పోలిస్తే దిల్ రాజు చాలా బెటర్ . దిల్ రాజు ని ప్రొడ్యూసర్ గా నిలబెట్టిందే అలాంటి చిన్న సినిమాలు . అందుకే కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లు వచ్చినా ఈ నాటికి దిల్ రాజు చిన్న సినిమాలని తెరకెక్కించడం మాత్రం మానుకోలేదు . అలా ఈ సంక్రాంతికి దిల్ రాజు బేనర్ లో తెరకెక్కిన చిత్రం శతమానం భవతి . అయితే ఇక్కడ అందరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇంతక ముందు దిల్ రాజు తెరకెక్కించిన 23 సినిమాలతో పోలిస్తే.. ఆయన లేటెస్ట్ మూవీ ‘శతమానం భవతి’నే ఆయనకి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా దాదాపు రూ.22 కోట్ల దాకా దిల్ రాజుకు లాభం తెచ్చిపెట్టి ఉండొచ్చని అంటున్నారు. ‘శతమానం భవతి’ సినిమాను రూ.8-9 కోట్ల మధ్య బడ్జెట్లో పూర్తి చేశాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్ .నైజాం ఏరియాతో పాటు వైజాగ్ కూడా తనకే ఉంచుకుని.. మిగతా ఏరియాల హక్కులన్నింటినీ అమ్మేశాడు. ఈ అమ్మకాలతోనే దాదాపుగా రాజుకు పెట్టుబడి గిట్టుబాటు అయిపోయినట్లు సమాచారం. ఇక ఈ రెండు ఏరియాలతో వచ్చిన రూ.16 కోట్ల షేర్ రాజుకు దక్కిన లాభం అణా టాక్ వినిపిస్తుంది .ఇక ‘శతమానం భవతి’ శాటిలైట్ డీల్ తో కలుపుకొని మరో 6 కోట్లు తన ఖాతాలో వేసుకున్నా దిల్ రాజు లాభం 22 కోట్లు అన్న లెక్క యిట్టె అర్ధం అయిపోతుంది. మరి ఇప్పటికైనా మిగతా నిర్మాతలు చిన్న సినిమాల పై శ్రద్ద పెడతారో లేదో చూడాలి.