దసరా రేసులో శర్వానంద్


శ‌ర్వానంద్ హీరోగా, మెహ‌రిన్ హీరోయిన్ గా, క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్రమోద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రానికి మ‌హ‌నుభావుడు అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ఒక్క సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈరోజు నుండి డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామెజిఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆగస్టు 24న ఈ చిత్రానికి సంభందించి మెద‌టి లుక్ అండ్ మెద‌టి లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేస్తున్నారు. ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా దర్శకనిర్మాతలు పావులు కదుపుతున్నారు. మహానుభావుడు సెప్టెంబర్ 29 న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.