Sekhar Kammula Searching For A Young Boy


కుర్రాడిని వెతుకుతున్న శేఖ‌ర్ క‌మ్ముల
వ‌రుణ్ తేజ్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాకు సంబంధించిన స‌న్నాహాలు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న త‌రుణంలో ఈ సినిమాలో 8 సంవ‌త్స‌రాల నుంచి 12 సంవ‌త్స‌రాల లోపు కుర్రాడి పాత్ర ఉంద‌ట‌. ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర‌ను ఓ కొత్త కుర్రాడితో చేయిస్తేనే బాగుంటుంద‌ని భావించిన శేఖ‌ర్ క‌మ్ముల, అలాంటి కుర్రాడికోసం ఒక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చాడు. ఆ కుర్రాడు అమెరిక‌న్ స్లాంగ్ తో కూడిన తెలుగు మాట్లాడితే ఇంకా మంచిద‌ని చెప్పి, ఆస‌క్తి ఉన్న‌వారు త‌న‌ని సంప్ర‌దించ‌మ‌ని అన్నాడు. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని అర్థ‌మ‌వుతుంది. .