Satyaraj To Play A Key Role In Ram Next Movie


మ‌రోసారి రామ్ సినిమాలో స‌త్య‌రాజ్
 
నేను శైల‌జ‌. 2016 సంవ‌త్సరానికి శుభారంభం ప‌లికిన మొట్ట‌మొద‌టి విజ‌యం. చాలా కాలం త‌ర్వాత రామ్ త‌న ఎనర్జీకి తగ్గ విజ‌యం అందుకున్న సినిమా. ఈ సినిమా తర్వాత రామ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఆయ‌న అభిమానుల‌తో స‌హా అంద‌రూ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అందుకున్న రామ్ కూడా జాగ్ర‌త్త‌గా ఆచితూచి అడుగు వేసి క‌థ‌పై బాగా క‌స‌ర‌త్తు చేసి రంగంలోకి దిగ‌డానికి రెడీ అవుతున్న త‌రుణంలో కందిరీగ శ్రీనివాస్ తో క‌లిసి సినిమా చేయ‌డానికి రామ్ సైన్ చేశాడు. ఈ సినిమాలో క‌థానాయిక‌గా రాశీఖ‌న్నాను ఎంపిక చేయ‌గా, ఒక కీల‌క పాత్ర లో స‌త్య‌రాజ్ న‌టించునున్నాడనేది తాజా స‌మాచారం.
స‌త్య‌రాజ్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవునుంద‌ని చెబుతున్నారు. నేను శైల‌జ త‌ర్వాత రామ్, స‌త్య‌రాజ్ క‌లిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఇటీవ‌ల కాలంలో స‌త్య‌రాజ్ కి తెలుగులో మంచి పాత్ర‌లు రావ‌డం, అవి బాగా ఆద‌ర‌ణ పొందుతున్న త‌రుణంలో ఈ సినిమా ఛాన్స్ వ‌చ్చిందని అంటున్నారు. జూన్ 3నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నున్న ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ హైద‌రాబాద్ లోనూ, రెండ‌వ షెడ్యూల్ వైజాగ్ లోనూ ప్లాన్ చేస్తున్నారు.