స‌మంత మామూలుది కాదుగా..


'జ‌న‌తా గ్యారేజ్' సినిమా త‌ర్వాత స‌మంత ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. పోనీ అస‌లు సినిమాలే చేయ‌వా చెప్మా అంటే, త‌మిళ్ లో విశాల్ స‌ర‌స‌న 'ఇరుంబు తిరాయ్' అనే మూవీ కి సైన్ చేసిన శ్యామ్, తెలుగులో మాత్రం త‌న రేంజ్ కి త‌గిన పాత్ర‌లు వ‌స్తేనే ఒప్పుకుంటానంటుంది.
 
అయితే 'ఇరుంబు తిరాయ్' చిత్రానికి స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందే ఆగ‌స్టు నెలాఖ‌రులో. షూటింగ్ అక్టోబ‌ర్ మొద‌ట్లో ప్రారంభించారు. అంటే ప‌ట్టుమని నెల కూడా కాలేదు. అప్పుడే ఒక షెడ్యూల్ పూర్తి అయిపోయిందంటూ స‌మంత ట్వీట్ చేసి అంద‌ర్నీ షాక్ కు గురిచేసింది.  అస‌లు ఎప్పుడూ ట్విట్ట‌ర్ లోనే ఉంటూ అదీ ఇదీ క‌బుర్లు చెప్తున్న స‌మంత ఎప్పుడు షూటింగ్ కి వెళ్తుంది అనేది అర్థం కాని విష‌యంగా మారింది. కానీ స‌మంత పోస్ట్ చేసిన ఆ ఫొటో చూస్తుంటే మాత్రం త‌న లుక్స్, ఫేస్ చాలా ఫ్రెష్ గా, మ‌రింత గ్లామ‌ర‌స్ గా శ్యామ్ త‌యారైంది.
 
విశాల్ హీరోగా మ‌రియు త‌నే స్వ‌యంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌ముఖ మ‌ల‌యాళ హీరో ఆర్య విల‌న్ గా న‌టిస్తుండ‌గా, ఈ చిత్రం థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో తెర‌కెక్కుతుంది.