Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Sarainodu Completed 50days


Stylish star Allu arjun as hero and successful director Boyapati sreenu came with a movie Sarainodu this year  which is turned out a huge blockbuster this year is celebrating its 50 days on june 10th. It created a huge records by collecting highest money in their both carriers and surprised total trade in tollywood. Sarainodu got a top 5th place in tollywood according to collections. In many areas it collected top 1. It completed 50 days and running towards 100 days.
50 రోజులు పూర్తిచేసుకున్న స‌మ్మ‌ర్‌ బ్లాక్ బస్టర్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్‌ 'సరైనోడు' 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో, సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, అల్లు అరవింద్ నిర్మాణంలో తెర‌కెక్కిన‌ చిత్రం సరైనోడు చిత్రం జూన్‌ 10వ తేదికి విజ‌య‌వంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంటుంది. స‌రైనోడు చిత్రం స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేస్తూ, ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. క‌లెక్ష‌న్ల ప్ర‌కారం టాలీవుడ్ టాప్‌ 5 చిత్రాల్లో స‌రైనోడు చిత్రం చోటు చేసుకుంది. చాలా ఏరియాల్లో సోలోగా నెం1 పోజిష‌న్స్ లో టాప్ టౌన్ రికార్డ్స్ క్రియెట్ చేసింది. 50 రోజులు పూర్తిచేసుకుని 100 రోజుల కి శ‌ర‌వేగంగా దూసుకుపోతుంది. 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... సరైనొడు చిత్రం మా బ్యాన‌ర్‌లో అల్లు అర్జున్‌, ర‌కూల్ ప్రీత్ సింగ్‌,కేథ‌రిన్ కాంబినేష‌న్ లో బోయపాటి శ్రీను ద‌ర్శ‌కుడిగా నిర్మిచాము. సమ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేసిన మా చిత్రం మా అంచ‌నాలు మించి విజ‌యం సాధించింది. ముఖ్యంగా చూసిన ప్ర‌తి ఓక్క‌రు బ‌న్ని ఫెర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. బ‌న్ని చాలా మెచ్యుర్డ్ గా న‌టించాడ‌ని చెప్పారు. దానికి బ‌న్ని చాలా క‌ష్ట‌ప‌డి త‌న బాడీ లాంగ్వెజ్ ని ఈ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా మ‌లుచుకుని చేశాడు. అలాగే బోయ‌పాటి శ్రీను గారికి మాస్ ప‌ల్స్ బాగా తెలుసు బ‌న్ని ని ఎలా చూపించాలో తెలిసిన వ్య‌క్తి కావ‌టం వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన స‌రైనోడు కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. థ‌మ‌న్ అందించిన ఆడియో సినిమాకి ప్ల‌స్ అయ్యింది. ముఖ్యంగా ర‌కూల్ ప్రీత్‌సింగ్‌, కేథ‌రిన్ లు ఇద్ద‌రూ పోటాపోటిగా నటించి మెప్పించారు. అలాగే శ్రీకాంత్‌, జ‌య‌ప్ర‌కాష్‌, సాయికుమార్‌లు  స‌పోర్టివ్ పాత్ర‌లో చాలా బాగా చేశారు. బ్ర‌హ్మ‌నందం, అన్న‌పూర్ణ , విద్యులేఖ చేసిన కామెడి మా చిత్రాన్ని ఫ్యామిలి ఆడియ‌న్స్ కి ద‌గ్గ‌ర చేసింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులని ఆక‌ట్టుకుంది. 50 రోజులు పూర్తిచేసుకుని 100 రోజుల‌కి దూసుకుపోతుంది. ఈ ఘ‌న‌విజ‌యం అందించిన ప్ర‌పంచంలో వున్న తెలుగు ప్రేక్ష‌కుల కి మా హ్రుద‌య పూర్వ‌క ద‌న్య‌వాదాలు.. అని అన్నారు.