సంపూ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు


ఆంధ్ర‌ప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం యువత చేప‌ట్టిన నిరసన కార్యక్రమానికి సినీ హీరో సంపూర్ణేష్ బాబు మద్దతు తెలిపిన విషయం విదిత‌మే. తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడినైనా... తెలుగురాష్ట్ర హోదా కోసం తన వంతు కృషి చేస్తానని ఆల్రెడీ సంపూ తెలిపాడు. ఈ నేపథ్యంలో, ఉద‌యం విశాఖ‌కు చేరుకున్న సంపూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

sampooఉద‌యం విశాఖ చేరుకున్న సంపూ ఆర్కే బీచ్ కి వెళ్తుండ‌గా, బీచ్ రోడ్ లో అత‌ణ్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల‌కు, సంపూర్ణేష్ బాబు కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. బీచ్ రోడ్ లో స్థానికుల‌కు త‌ప్ప, బ‌య‌ట వారికి, ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు అనుమ‌తి లేద‌ని చెప్పి, ఆపై పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. ఈ సందర్భంగా సంపూ మాట్లాడుతూ, ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ, తెలుగువారంతా ఒక్కటేనని, హోదా కోసం యువత చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరాడు.