స‌మంత‌ చేతిలో ఓడిన నాగ‌చైత‌న్య‌


ఇప్పటికే నాగచైతన్య ని లవ్ లో పడేసిన సమంత తాజాగా బ్యాడ్మింటన్ లో కూడా ఓడించింది . తన చేతిలో చైతూ ఓడిపోవడంతో ఆ సంతోషాన్ని పట్టలేక బ్యాడ్మింటన్ కోర్టులోనే కిందపడి మరీ దొర్లింది .ఈ ఆటలో తానే గెలిచానని, చైతు ఓడిపోయాడని, చైతు ఫొటోపై లూజర్‌, తన ఫొటోపై విన్నర్‌ అని రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది సమంత. ఇటీవలే ప్రేమమ్ సక్సెస్ తో జోరు మీదున్న చైతూ తో ఆటవిడుపు గా ఈ గేం స్టార్ట్ చేసింది అయితే బ్యాడ్మింటన్ లో నాగచైతన్య ని చీట్ చేసి గెలిచిందట . ఈ ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఈ ఇద్దరూ చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు .