Samantha Turned Model For Pocket Money


నా లైఫ్‌నే మార్చేసిన పార్టీ అది- స‌మంత‌
జీవితంలో జ‌రిగే ఒక ఇన్సిడెంట్ చాలు, జీవితాన్నే మార్చేయ‌డానికి. అన్నిసార్లు ఇలా జ‌ర‌క్క‌పోయినా, కొన్నిసార్లు మాత్రం లైఫ్ ను మార్చే స‌న్నివేశాలు జ‌రుగుతుంటాయి. అనుకోకుండా స‌మంత ఫోటోలు చూసిన గౌత‌మ్ మీన‌న్ హీరోయిన్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని చెప్పిన స‌మంత‌, ఆ అనుకోకుండా ఎలా చూశార‌నే విష‌యం గూర్చి డీటెయిల్డ్ గా చెప్పింది శ్యామ్.
ఓ క్లోజ్ ఫ్రెండ్ బ‌ర్త్ డే పార్టీకి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ చాలా ఫోటోలు తీశారు. ఆ త‌ర్వాత రోజు అవి పేప‌ర్ లో వ‌చ్చాయి. వాటిని చూసిన ఒక వ్యాపారి త‌న క్లాత్ షోరూమ్ కి మోడ‌లింగ్ చేయ‌మ‌ని అడిగారు. అలా అనుకోకుండానే మోడ‌ల్ గా మారిన నాకు గ‌తంలో కెమెరా అంటే చాలా భ‌యం, కానీ పాకెట్ మ‌నీ కోసం మోడ‌లింగ్ చేశా అని చెప్పింది. తర్వాత సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ ద్వారా నాకు హీరోయిన్ ఛాన్స్ లభించింది. అలా నా ఫోటోల‌ను చూసిన డైర‌క్ట‌ర్ గౌత‌మ్ మీనన్ ఏ మాయ చేశావే సినిమాలో చైతుకి జంట‌గా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. నా అదృష్టం కొద్దీ ఆ సినిమాలో జెస్సీ క్యారెక్ట‌ర్ కు మంచి క్రేజ్ రావ‌డంతో, హీరోయిన్ అయిపోయానంటూ చెప్పుకొచ్చింది ఈ సౌత్ స్టార్ హీరోయిన్.