Samantha Stops Doing Love Stories


ఇక ల‌వ్ స్టోరీలు చేయ‌ను- స‌మంత‌
ఏది ఏమ‌యినా ఈ సారి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ కొట్టి త‌న స‌త్తా చాటాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది స‌మంత‌. మొన్నీ మ‌ధ్య వ‌చ్చిన 24 సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా ఆ సినిమాలో సమంత క్యారెక్ట‌ర్ ని మాత్రం క్రిటిసైజ్ చేశారు. దాని త‌ర్వాత వ‌చ్చిన బ్ర‌హ్మోత్స‌వం కూడా నిరాశే మిగిల్చింది. దీంతో మంచి క‌సి మీదున్న స‌మంత అ..ఆ గురించి చాలా విష‌యాలే చెప్తూ, దాని మీదే త‌న ఆశలు పెట్టుకున్న విష‌యాన్ని బ‌య‌ట పెట్టేసింది.
త‌ను నేర్చుకున్న న‌ట‌న‌, త‌నకు వ‌చ్చినదంతా అ..ఆ లో బ‌య‌ట‌పెట్టేసింద‌ట‌. ఇంకోసారి ల‌వ్ స్టోరీలు చేయ‌ను, చేయలేను కూడా. ఇదే నా కెరీర్ లో లాస్ట్ ల‌వ్ స్టోరీ అని తేల్చి చెప్పింది శ్యామ్. ఇప్ప‌టి వ‌ర‌కు తాను చేసిన ల‌వ్ స్టోరీలు ఒకెత్త‌యితే, ఈ స్టోరీ ఇంకో ఎత్త‌ట‌. ఈ సినిమా నా నుంచి చాలా తీసుకుంది. క్లైమాక్స్ లో అంద‌రూ న‌వ్వుకుంటూ కామెడీ చేస్తుంటే నేను మాత్రం సీరియ‌స్ లుక్ లో ఏడుస్తూ ఉండాలి, మ‌న చుట్టు న‌లుగురు న‌వ్వుతున్న టైమ్ లో మ‌నం ఏడుస్తూ కూర్చోవాలంటే ఎంత క‌ష్టంగా అనిపించింది. ప‌క్క‌న పోసాని గారి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లు ఉన్న‌ప్పుడు న‌వ్వ‌కుండా ఏడ‌వాలంటే ఎలా సాధ్యం చెప్పండి అంటూ త‌న క‌ష్టాల‌ని చెప్పుకొచ్చింది స‌మంత‌.