స‌మంతకి కూడా లోప‌మే..


రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌సినిమాలో హీరోయిన్ గా స‌మంత క‌న్ఫార్మ్ అని నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న అయితే చేశారు కానీ, అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు స‌మంత మాత్రం ఈ సినిమా గురించి నోరెత్తి ఒక్క‌మాటా మాట్లాడ‌లేదు. మూవీ లాంఛ్ రోజు విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ లో తప్పించి, స‌మంత పేరు వినిపించలేదు కూడా. అయితే ఇప్పుడు స‌మంత రామ్ చ‌ర‌ణ్ సినిమాలో న‌టిస్తున్నా అన్న విష‌యం త‌నంత‌ట తానే చెప్పింది. గోదావ‌రి తీరంలోని ప‌ల్లెటూరిలో సూర్యోద‌యం స‌మయంలో ఫొటోల‌ను తీసి షేర్ చేసిన స‌మంత‌, #RC11, #Sukumar అంటూ హాష్ ట్యాగ్ లు పెట్టి మ‌రీ పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని స‌మంత క్యారెక్ట‌ర్ గురించి మ‌రొక ఇంట్రెస్టింగ్ వార్త బ‌య‌టికొచ్చింది. 

ఈసినిమాలో స‌మంత ఒక మూగ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఆల్రెడీ రామ్ చ‌ర‌ణ్ కు వినికిడి లోపం ఉన్న సినిమాలో హీరోయిన్ మూగ‌ది అన‌గానే అంద‌రికీ షాక్ తిన్నంత ప‌నైంది. ఎప్పుడూ త‌న సినిమాలో కొత్త‌ద‌నం ఉండేలా చూసుకునే సుకుమార్ ప్ర‌స్తుతం త‌న త‌ర్వాతి సినిమాను ఇలా సెట్ చేశాడ‌న్న‌మాట‌.