సావిత్రి మూవీలో సమంత చేయబోతున్న పాత్ర ఇదేనా!


మహానటి సావిత్రి జీవితంపై సినిమా వస్తుందని తెలుగు సినీ ప్రేక్షకులకి అందరికి తెలిసిందే ..  మహానటి టైటిల్ పై రూపొందుతున్న చిత్రంలో కీర్తి సురేష్.. సమంతలు నటిస్తున్నారన్న విషయమూ కూడా అందరికి తెలిసిన సంగతే. టైటిల్ రోల్ అయినా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుందన్న మాట వాస్తవమే. కానీ, ఇంతకూ ఈ సినిమాలో సమంత పోషిస్తున్న పాత్ర  ఏంటి? అన్నది అందరిని అంతుపట్టని విషయం.


సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఇప్పుడిప్పుడే స్టార్ డం దగ్గరకు వస్తున్న యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ను తీసుకుని.. మరో పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సమంతను దర్శక నిర్మాతలు ఒప్పించారంటే.. ఖచ్చితంగా అది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర అయ్యి ఉంటుంది. లేకపోతే, సమంత ఒప్పుకోదు కదా. మొదట సమంత చేసేది సావిత్రి కథను నేరేట్ చేసే జర్నలిస్ట్ పాత్ర అనే టాక్ వచ్చింది. తర్వాత అలనాటి మరో మేటి నటి జమునగా సమంత నటిస్తోందంటూ పుకార్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ సమంత పోషిస్తున్న పాత్ర విలేఖరి రోల్ మాత్రమే అంటున్నారు. అది కూడా ఇప్పటి జర్నలిస్టు పాత్ర కాదంట. 1980ల కాలంనాటి జర్నలిస్ట్ పాత్ర అంటున్నారు. ఇది కూడా నిజమే అని ఇప్పుడే చెప్పలేం ఎందుకంటే ఇంకా దర్శక నిర్మాతలు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.