Samantha About Her Locket


'N' లాకెట్ నాకెంతో ఇష్టంః స‌మంత‌
స‌మ్మ‌ర్ లో వ‌రుస‌గా భారీ చిత్రాల విడుద‌ల‌తో నిలుస్తుంది సమంత‌. థేరీతో మొద‌లుపెట్టి 24, బ్ర‌హ్మోత్స‌వం, జూన్ 2న అ..ఆ ఇలా వ‌రుస‌గా అన్నీ పెద్ద బ‌డ్జెట్ సినిమాలన్నీ స‌మంతవే. అన్ని సినిమాల ప్ర‌మోష‌న్స్ కు కూడా స‌మంత వ‌స్తుండ‌టంతో అమ్మ‌డిపేరు మార్మోగిపోతుంది. ఇటు సినిమాల‌తో పాటు అటు ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా త‌న అభిమానుల‌తో స‌మంత షేర్ చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఇప్పుడు మ‌రొకసారి వార్తల్లో నిలిచింది స‌మంత‌. ఈ మ‌ధ్య త‌నకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడ‌ని, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ పేరు చెప్ప‌కుండా యంగ్ హీరో అనడంతో.. ఆ యంగ్ హీరో ఎవ‌రై ఉంటారా అని ఊహాగానాలు ఎక్కువైపోయాయి. స‌మంత ఇప్పుడు మ‌రో ట్వీట్ చేసింది. నాకు బాగా న‌చ్చిన‌వి ఇవే.. నా ఎన్ లాకెట్, నా చిన్న ఫ్లాట్స్, నా బ‌కెట్ బ్యాగ్, ఒక గొప్ప పుస్తకం అంటూ ఫోటోల‌ను కూడా ట్వీట్ చేసింది. ఈ ఎన్ లాకెట్ ని గ‌తంలో రెగ్యుల‌ర్ గా వేసుకుని క‌నిపించేది స‌మంత‌. దానిపై క్వ‌శ్చ‌న్స్ ఎక్కువైపోవ‌డంతో ప‌క్క‌న పెట్టింది, మ‌ళ్లీ ఈ ట్వీట్ చేసింది.
టాలీవుడ్ లో ఎన్ అక్షరంతో మొదలై.. సమంతతో ఎక్కువగా సినిమాలు చేసిన యంగ్ హీరో ఎవరో అందరికీ తెలుసు.కానీ స‌మంత త‌న బాయ్ ఫ్రెండ్ గురించి యంగ్ హీరో అని మాత్ర‌మే చెప్పింది కానీ టాలీవుడ్ యంగ్ హీరో అన‌లేదు. ఏదైనా ఈ ఎన్ లాకెట్ త‌న బాయ్ ఫ్రెండ్ కు సంబంధించినదే అని అభిమానులు ఫిక్స‌వుతున్నారు. స‌మంతా ఇలా మాటిమాటికీ ఊరించేది ఎందుక‌మ్మా.. చెప్పేయ‌కూడ‌దూ..