విన్న‌ర్ ఓడిపోయాడు..


తిక్క త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన విన్న‌ర్ మూవీ గ‌త‌వారం విడుద‌లైంది. హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌కుల్ హీరోయిన్ గా న‌టించ‌డం, అంద‌రూ బాగా ఫేమ్ లో ఉన్న‌వాళ్లే కావ‌డంతో సినిమాపై భారీ అంచనాలే నెల‌కొన్నాయి. కానీ ఆ ఆశ‌ల‌న్నీ విడుద‌ల త‌ర్వాత నీరు కారిపోయాయి. 


ఫ‌స్ట్ డే, ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ బాగానే ఉన్నా, ఆ త‌ర్వాత వీక్ క‌లెక్ష‌న్స్ మాత్రం బాగా డ‌ల్ అయ్యాయి. రెండ‌వ వారంలో కూడా క‌లెక్ష‌న్స్ బాగానే వ‌స్తాయిలే అనుకున్న నిర్మాత‌ల ఆశ‌లు ఒమ్ముపాల‌య్యాయి. సాయి న‌టించిన సుప్రీమ్ 27 కోట్ల షేర్ ను క‌లెక్ట్ చేయడంతో, ఈ సినిమాకు బాగానే ఖ‌ర్చు పెట్టారు నిర్మాత‌లు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా కేవ‌లం 14కోట్ల షేర్ ను మాత్ర‌మే రాబ‌ట్టింది. సుప్రీమ్ వ‌ర‌కు స‌క్సెస్ ల‌తో దూసుకెళ్లిన ఈ మెగా మేన‌ల్లుడికి తిక్క‌, విన్న‌ర్ నిరాశ‌నే మిగిల్చాయి. ఈ రెండింటి ప్ర‌భావం త‌న త‌ర్వాత సినిమాపై ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని సాయి తెగ దిగులు ప‌డిపోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సాయి ధ‌ర‌మ్ తేజ్ బీవీఎస్ ర‌వి డైర‌క్ష‌న్ లో ఓ సినిమా చేస్తున్నాడు.