ప్రేక్షకులకి తన రియాలిటీ చూపించేస్తున్న సాయి ధరమ్ తేజ్


మెగా ఫామిలీ హీరోల్లో ఎవరూ చేయని ఓ ప్రయత్నాన్ని సాయి ధరం తేజ్ చేస్తున్నాడు. ఈ మధ్య  వెబ్ మీడియాతో పాటు వెబ్ సిరీస్ లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. సాయి ధరమ్ తేజ ఇప్పుడు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న 'నేను మీ కళ్యాణ్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ లో తేజు చేస్తున్నది రియల్ లైఫ్ లోని తన పాత్రే కావడం విశేషం. 'నాకు ఇది కొత్త ఎక్స్ పీరియన్స్. అలాగే నా పాత్రనే నేను చేస్తుండడం మరో కొత్త అనుభూతిని ఇస్తోంది. సహజంగా యాక్టింగ్ చేసేటపుడు మన ఒరిజినాలిటీని దాచుకుని నటించాల్సి ఉంటుంది. కానీ నా రియల్ లైఫ్ కేరక్టర్ నే ఇందులో చేస్తుండడంతో.. ప్రపంచానికి మనలోని రియాలిటీని ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. మనల్ని మనం మరింతగా ఎక్స్ పోజ్ చేసుకోవడానికి ఇలాంటి కేరక్టర్స్ ఉపయోగపడతాయి' అంటున్నాడు మన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ.


ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్  వచ్చిందని.. మిగిలిన ఎపిసోడ్ లను కూడా ప్రేక్షకులు ఈ స్థాయిలోనే ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు తేజు తెలియజేసాడు. తనకోసమే పుట్టిన అమ్మాయి, నిజమైన ప్రేమ కోసం ప్రతి క్షణం తపన పడే రేడియో జాకీ కళ్యాణ్ యొక్క కథనే ఈ 'నేను మీ కళ్యాణ్'. కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం.. మంచి ఉద్యోగం అన్నీ ఉన్న ఈ పాత్రకు.. ప్రేమ ఒక్కటి లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ వెబ్ సిరీస్ ని తీర్చిదిద్దుతున్న తీరు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.