“కన్నుల్లో నీ రూపమే”లో మొదటి పాట టీజర్ ను విడుదల చేసిన సాయిధరమ్ తేజ్


టాలెంటెడ్ హీరో నందు, కన్నడ భామ తేజస్విని ప్రకాశ్ జంటగా నటించిన సినిమా 'కన్నుల్లో నీరూపమే'. నూతన దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల ఈ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఏ.యస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ భాసాని నిర్మాణ సారథ్యంలో ఫీల్ గుడ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బిక్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. హీరోగా నందు కెరీర్ లోనే హై బడ్జెట్ సినిమాగా కన్నుల్లో నీ రూపమే రూపుదిద్దుకుంటోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాకేత్ కోమండూరి వినసంపైన బాణీలు అందించారు. ప్రముఖ్య మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. ఈ అల్బమ్ లో మొదటిగా వచ్చే చెలి నీవే నా ప్రాణం అనే పాట వీడియో టీజర్ ను సుప్రీమ్ సాయిధరమ్ తేజ్ తాజాగా విడుదల చేశారు. హీరో హీరోయిన్లతో పాటు పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృధ్వి కీలక పాత్రలు పోషిస్తున్నఈ సినిమాకు సినిమాటోగ్రఫి- సుభాష్ దొంతి, ఎడిటర్ - మహెందర్ నాథ్.బి.