Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Sai Dharam Tej In Bhale Bhale Direction


'భ‌లే భ‌లే డైర‌క్ట‌ర్' తో సాయి ధ‌ర‌మ్ తేజ్
 
మొద‌టి సినిమా పిల్లా నువ్వు లేని జీవితంతోనే విజ‌యం సాధించిన మెగాహీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు సుప్రీమ్ స‌క్సెస్ తో మాంచి ఊపు మీదున్నాడు. ఈ సినిమా త‌రువాత ఆయన తిక్క సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. దాని త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని తో ఒక సినిమా ఇలా రెండు మూడు సినిమాలతో అస‌లు ఖాళీ లేకుండా త‌న షెడ్యూల్ ను బిజీ చేసుకున్నాడు ఈ సుప్రీమ్ హీరో. ఈ నేప‌థ్యంలోనే సాయితో సినిమా చేయ‌డానికి భ‌లే భ‌లే డైర‌క్ట‌ర్ మారుతి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని తెలుస్తోంది.
భ‌లే భ‌లే మ‌గాడివోయ్ తో విజ‌యాన్నందుకున్న మారుతి బాబు బంగారంగా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా త‌రువాత ఆయ‌న సాయి ధ‌ర‌మ్ తేజ్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడ‌ట‌. ఇటీవ‌ల మారుతి వినిపించిన క‌థ సాయికి బాగా న‌చ్చి ఓకే అన్నాడ‌ని అంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్స్క్ కూడా పూర్త‌య్యాయని, త్వ‌ర‌లోనే ఈ సినిమా పూర్తి వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంద‌న్నమాట‌.